భూపాలకులకు
1-167-క.
భూపాలకులకు విప్రుల
గోపింపం జేయఁ దగదు కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి
భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్.
ప్రజాపాలకులగు
క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయరాదు. అలా చేస్తే విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా భూకంపంలా వారి
వంశ నాశనానికి దారితీస్తుంది.
కృష్ణార్జునులు పుత్రఘాతి యగు అశ్వత్థామను బంధించి తెచ్చి ద్రౌపది
మ్రోల పడవేసారు. ఆ సందర్భంలో కృష్ణార్జునలతో ద్రౌపది పలికిన పలుకులివి.
1-167-ka.
bhoopaalakulaku
viprula
gOpiMpaM
jaeya@M dagadu kOpiMchina@M da
tkOpaanalaMbu
modaliki
bhoopaalaaTavula@M
gaalchu bhookaMpamugan.
భూపాలకులు = రాజుల;
కున్ = కి; విప్రులన్ = బ్రాహ్మణులను; కోపింపన్ = కోపించుట; చేయన్ = చేయుటకు; తగదు = తగినది కాదు; కోపించినన్ = కోపము చేసినచో; తత్ = ఆ యొక్క; కోప = కోపము అనే; అనలంబు = అగ్ని; మొదలి = మొదలకి; కిన్ = అంటా; భూపాల = రాజులు అను; అటవులన్ = అడవులను; కాల్చు = కాల్చివేయును; భూ = భూమి; కంపముగన్ = కంపించునట్లుగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment