Sunday, April 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 257

అతిథి

9-99-ఆ.
తిథి పోయిరామి ధిప! యీ ద్వాదశి
పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంట గాదు కుడుచుటయును గాదు
లిలభక్షణంబు మ్మతంబు.
          వెళ్ళిన అతిథి రాకపోతే ద్వాదశి పారణ మానడం ధర్మంగాదు. నీళ్ళు తాగితే భోజనం చేసినట్టు కాదు. చేయనట్టు కాదు. అందుచేత నీళ్ళు తాగడం ధర్మసమ్మతమే.
అంబరీషమహారాజుకి ద్వాదశీవ్రతాతంలో దూర్వాస మహర్షి అతిథిగా వచ్చి, నదిలో స్నానాని కని వెళ్ళారు.  ద్వాదశి ఘడియలు వెళ్ళకుండా భోంచేయాలి కదా ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని విప్రులను ధర్మసందేహ మడుగగా, వారు ఇలా ధర్మసందేహం తీర్చారు.
9-99-aa.
atithi pOyiraami nadhipa! yee dvaadaSi
paaraNaMbu maana@M baaDi gaadu
guDuvakuMTa gaadu kuDuchuTayunu gaadu
salilabhakshaNaMbu sammataMbu.
          అతిథి = భోజనార్థమువచ్చినవాడు; పోయి = వెళ్ళి; రామిన్ = రాకపోవుటచేత; అధిప = రాజా; = ; ద్వాదశి = ద్వాదశిగడియలలోనే; పారణంబు = తినుట; మానన్ = మానివేయుట; పాడి = ధర్మము; కాదు = కాదు; కుడువకుంటన్ = తినకుండుట; కాదు = కాదు; కుడుచుటయును = తినుట; కాదు = కాదు; సలిల = మంచినీరు; భక్షణంబు = తీసుకొనుట; సమ్మతంబు = అంగీకారయోగ్యమైనది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: