Thursday, April 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 247

తలగినదానం

10.1-319-. 
లఁగినదానం దల మనఁ 
లఁగక యా చెలికి నాన లయెత్తఁగ నీ 
లఁగిన చోటెయ్యది యని 
 యూఁచెన్ నీ సుతుండు గవె? మృగాక్షీ! 
          చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు అంటే, నీ పుత్రుడు  తప్పుకోడు. పైగా తలూపుతూ బయిష్ఠు అయిన చోటేదిఅని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.

కపట మానవబాలకు డైన శ్రీకృష్ణమూర్తి క్రీడించే ఆ లీలలు  తమను అనుగ్రహించడమే నని యెరుగక, గోపికలు ఓపికలులేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-319-ka. 
tala@MginadaanaM dala mana@M 
dala@Mgaka yaa cheliki naana talayetta@Mga nee 
tala@Mgina chOTeyyadi yani 
tala yoo@Mchen nee sutuMDu tagave? mRgaakshee! 
          తలగినదానన్ = బహిష్టురాలను; తలము = తప్పుకొనుము; అనన్ = అనగా; తలగక = తప్పుకొనక; = ; చెలి = ఇంతి; కిన్ = కి; నాన = సిగ్గు; తలయెత్తగ = కలుగునట్లుగా; నీ = నీ యొక్క; తలగిన = తొలగిన; చోటు = చోటు; ఎయ్యది = ఏది; అని = అని; తల = శిరస్సును; ఊచెన్ = ఊపెను; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; తగవె = ఇదిధర్మమేనా. కాదు; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - లేడికన్నులామె, స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: