గుఱ్ఱముగొనిపో
9-215-క.
గుఱ్ఱముఁ గొనిపో బుద్ధుల
కుఱ్ఱఁడ! మీ తాతయొద్దకున్ నీతండ్రుల్
వెఱ్ఱులు నీఱై రదె! యీ
మిఱ్ఱున గంగాజలంబు మెలఁగ శుభమగున్.
ఓ బుద్ధిమంతుడైన కుర్రాడ! ఈ గుర్రాన్ని మీ
తాత వద్దకి తీసుకుపో. నీ తండ్రులు తెలివితక్కువవారై బూడిద అయిపోయారు అదిగో. ఆ దిబ్బ
మీదకి గంగాజలం ప్రవహిస్తే శుభం కలుగుతుంది.
సగరుని మనవడు, భగీరధుని తాత, అంశుమంతుడు. కపిలమహర్షి ఆశ్రమంలో
అతని తండ్రులు బూడిదైపోయారు. అంశుమంతుని వినయం చూసి దయామయుడైన కపిలుడు ఇలా
చెప్పాడు.
9-215-ka.
guRRamu@M
gonipO buddhula
kuRRa@MDa!
mee taatayoddakun neetaMDrul
veRRulu neeRai
rade! yee
miRRuna
gaMgaajalaMbu mela@Mga Subhamagun.
గుఱ్ఱమున్ = గుర్రమును; కొనిపో = తీసుకుపో; బుద్దుల = మంచి బుద్దుల గల; కుఱ్ఱడ = పిల్లవాడ; మీ = మీ యొక్క; తాత = పితామహుని; ఒద్ద = దగ్గర; కున్ = కి; నీ = నీ యొక్క; తండ్రులు = తండ్రులు; వెఱ్ఱులు = తెలివితక్కువారు; నీఱు = బూడిద; ఐరి = అయిపొయారు; అదె = అదిగో; ఈ = ఈ; మిఱ్రునన్ = దిబ్బమీదకి; గంగాజలంబున్ = గంగాజలమును; మెలగన్ = ప్రవహిస్తే; శుభము = మంచి; అగును = జరుగును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
ఎంత చక్కగా వివరిస్తున్నారు రావుగారు.మీకు ధన్యవాదములు.
+sridevi gajula గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు.
Post a Comment