7-92-శార్దూల విక్రీడితము
“అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్;
మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్ నీ యెడన్
నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సం
పన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై.”

http://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=hiranyakasipuni%20korikalu
7-92-shaardoola vikreeDitamu
7-92-shaardoola vikreeDitamu
“annaa! kashyapaputra! durlabhamu lee yarthaMbu levvaarikin;
munnevvaaraluM~
gora ree varamulan; modiMchitin nee yeDan
nannuM
gorina vella nichchitiM~ braveeNatvaMbuto buddhi saM
pannatvaMbuna
nuMDu mee sumativai bhadraikasheeluMDavai.”
అన్నా = అయ్యా; కశ్యపపుత్రా = హిరణ్యకశిపుడ {కశ్యపపుత్రుడు - కశ్యపుని పుత్రుడు}; దుర్లభములు = పొందరానివి; ఈ = ఈ; అర్థంబులు = కోరబడినవి; ఎవ్వరికిన్ = ఎవరికైనను; మున్ను = ఇంతకు పూర్వము; ఎవ్వారలున్ = ఎవరునుకూడ; కోరరు = కోరలేదు; ఈ = ఇట్టి; వరములన్ = వరములను; మోదించితిన్ = సంతోషించితిని; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; కోరినవి = కోరినట్టివి; ఎల్లన్ = అన్నియును; ఇచ్చితిన్ = ప్రసాదించితిని; ప్రవీణత్వంబు = నేరుపు; తోన్ = తోటి; బుద్ధి = జ్ఞానము యనెడి; సంపన్నత్వంబునన్ = సంపదతో; ఉండుమీ = ఉండుము; సుమతివి = మంచి బుద్ధిగలవాడవు; ఐ = అయ్యి; భద్ర = మంగళ; ఏక = ప్రధానమైన; శీలుండవు = స్వభావములుగలవాడవు; ఐ = అయ్యి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment