7-3- వ. అనిన భక్తునికి భక్తవత్సలుం డిట్లనయె.
టీకా:
అనినన్ = అనగా; భక్తుని = భక్తుని; కిన్ = కి; భక్తవత్సలుండు = నరసింహుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యముగలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా భక్తాగ్రేస్వరుడైన ప్రహ్లాదుడు పలుకగా, భక్తుల ఎడ వాత్సల్యము చూపే వాడైన నరసింహావతారుడు.
7-378-మ.
నిజభక్తుండవు నాకు నిన్నుఁ గనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ
ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీ
ప జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
శ జనుల్ దుర్జనులైన శుద్దులు సుమీ సత్యంబు దైత్యోత్తమా!
ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీ
ప జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
శ జనుల్ దుర్జనులైన శుద్దులు సుమీ సత్యంబు దైత్యోత్తమా!
టీకా:
నిజ = నా యొక్త; భక్తుండవు = భక్తుడవు; నా = నా; కున్ = కు; నిన్నున్ = నిన్ను; కనుటన్ = జన్మనిచ్చుటచేత; నీ = నీ యొక్క; తండ్రి = తండ్రి; త్రిస్సప్త = ఇరవైయొక్క (21); పూర్వజులన్ = ముందురతమువారితో; కూడి = కలిసి; పవిత్రుడు = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; శుభ = శ్రేయో; గతిన్ = మార్గమున; వర్తించున్ = నడచును; విజ్ఞాన = సుజ్ఞానము యనెడి; దీప = దీపముచే; జిత = తరించిన; భవ = సంసారము యనెడి; అంధకారులు = చీకటి(అజ్ఞానము)గలవారు; అగు = అయిన; మత్ = నా యొక్క; భక్తుల్ = భక్తులు; వినోదించు = క్రీడించెడి; దేశ = ప్రదేశమునందు; జనుల్ = వసించెడివారు; దుర్జనులు = చెడ్డవారు; ఐనన్ = అయినను; శుద్ధులు = పవిత్రులే; సుమీ = సుమా; సత్యంబున్ = నిజముగ; దైత్య = రాక్షసులలో; ఉత్తమ = ఉత్తముడ.
భావము:
- “రాక్షస కులంలో ఉత్తమమైన వాడా! ప్రహ్లాదా! నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనడం వలన నీ తండ్రి ముయ్యేడు (27) ముందు తరాలవారితో పాటు శుభస్థితి పొందాడు. విజ్ఞానదీపికలు వెలిగించి సంసారా మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జను లైనా కూడా పరిశుద్ధులు అవుతారు. ఇది సత్యం.
No comments:
Post a Comment