Wednesday, May 18, 2016

క్షీరసాగరమథనం - దుర్వాసు

8-148-క.
దుర్వాసు శాపవశమున
నిర్వీర్యత జగము లెల్ల నిశ్శ్రీకములై
ర్వతరిపుతోఁ గూడ న
ర్వము లయి యుండె హతసుర్వావళులై.
టీకా:
            దుర్వాసు = దుర్వాసుని {దుర్వాసుడు - ఒకముని}; శాప = శాపము; వశమున = వలన; నిర్వీర్యతన్ = నిర్వీర్యమువలన; జగములు = భువనములు; ఎల్లన్ = సర్వమును; నిశ్శ్రీకములు = శుభములులేనివి {నిశ్శ్రీకములు - శ్రీకములు (శుభములు) లేనివి}; ఐ = అయ్యి; పర్వతరిపు = ఇంద్రుని {పర్వతరిపుడు - పర్వతముల శత్రువు (వాటి రెక్కలు వజ్రాముతో ఖండించుట చేత), ఇంద్రుడు}; తోన్ = తో; కూడన్ = కలిసి; అపర్వములు = వేడుకలులేనివారు; అయి = అయ్యి; ఉండె = ఉండెను; హత = దెబ్బతిన్న; సుపర్వా = దేవతల; ఆవళుల్ = సమూహములు; ఐ = అయ్యి.
భావము:
            “దుర్వాసుడి శాపం వలన లోకాలు అన్నీ పౌరుషమూ వైభవమూ కోల్పోయాయి. ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారు ఓడిపోయారు. పండగలు అంతరించాయి.”
            మరింకో దుష్కరమైన ర్వ తో ప్రాస; పర్వ తో యమకం. పోతన్న గారి పద్య సోయగమిది.
8-148-ka.
durvaasu shaapavashamuna
nirveeryata jagamu lella nishshreekamulai
parvatariputoM~ gooDa na
parvamu layi yuMDe hatasuparvaavaLulai.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: