Thursday, May 19, 2016

క్షీరసాగరమథనం - నెలవు వెడలి

8-149-ఆ.
నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి
వేల్పుగములఁ జూచి వేల్పుఁ బెద్ద
రమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల
ద్మవదనుఁ డగుచుఁ లికెఁ దెలియ.
టీకా:
          నెలవు = ఇల్లువాకిలి; వెడలి = వదలి; వచ్చి = వచ్చి; నిస్తేజులు = కాంతివిహీనులు; ఐనట్టి = అయినటువంటి; వేల్పు = దేవతల; గములన్ = సమూహములను; చూచి = చూసి; వేల్పు = దేవతల; పెద్ద = నాయకుడు; పరమపురుషున్ = హరిని; తలచి = స్మరించి; ప్రణతుడు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; సంపుల్ల = పూర్తిగావికసించిన; పద్మ = పద్మమువంటి; వదనుడు = ముఖముగలవాడు; అగుచున్ = అగుచు; పలికెన్ = చెప్పెను; తెలియ = తెలియునట్లు.
భావము:
          తమ ఇల్లూ వాకిలీ విడిచిపెట్టి కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు. పరమాత్మకు నమస్కరించి, ధ్యానం చేశాడు. తరువాత వికసించిన ముఖకమలంతో ఇలా అన్నాడు.
8-149-aa.
nelavu veDali vachchi nistejulai naTTi
velpugamulaM~ joochi velpuM~ bedda
paramapuruShuM~ dalaM~chi praNatuM~Dai saMphulla
padmavadanuM~ DaguchuM~ balikeM~ deliya.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: