Friday, May 20, 2016

క్షీరసాగరమథనం - ఏనును మీరును

8-150-క.
నును మీరును గాలము
మావ తిర్యగ్లతా ద్రు స్వేదజముల్
మానుగ నెవ్వని కళలము
వానికి మ్రొక్కెదముగాక గవఁగ నేలా?
టీకా:
          ఏనును = నేను; మీరును = మీరు; కాలము = కాలము; మానవ = నరులు; తిర్యక్ = జంతువులు; లతా = లతలు; ద్రుమ = చెట్లు; స్వేదజములు = సూక్షజీవులు {స్వేదజము - స్వేదమునుండి పుట్టునవి, పురుగులోనగునవి}; మానుగన్ = చక్కగ; ఎవ్వని = ఎవనియొక్క; కళలమున్ = అంశలమో; వాని = అతని; కిన్ = కి; మ్రొక్కెదముగాక = మొరపెట్టుకొనెదముగాక; వగవన్ = శోకించుట; ఏలా = ఎందుకు.
భావము:
నాకూ, మీకూ, కాలానికీ, మానవులకూ, పశువులకూ, పక్షులకూ, చెట్లకూ, తీగలకూ, చెమటతో పుట్టే అల్పజీవులకూ, మూలపురుషుడు భగవంతుడు అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి.
8-150-ka.
enunu meerunu gaalamu
maanava tiryaglataa druma svedajamul
maanuga nevvani kaLalamu
vaaniki mrokkedamugaaka vagavaM~ga nelaa?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: