8-144-క.
అప్పటినుండి బుధోత్తమ!
చెప్పెడు భగవత్కథా విశేషంబులు నా
కెప్పుడుఁ దనవి జనింపదు
చెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలున్.
8-145-వ.
అని మఱియు
నడుగం బడినవాఁడై యతని నభినందించి హరి ప్రసంగంబు జెప్ప నుపక్రమించె" నని సూతుండు ద్విజుల కిట్లనియె "నట్లు శుకుండు రాజుం
జూచి.
టీకా:
అప్పటినుండి =
ఇప్పటివరకు;
బుధ = జ్ఞానులలో;
ఉత్తమ = ఉత్తముడా;
చెప్పెడు = చెప్పుతున్న;
భగవత్ = భగవంతుని; కథా = వృత్తాంతముల;
విశేషంబులున్ = విశేషములవలన;
నా = నా; కున్ =
కు; ఎప్పుడు = ఎప్పుడును;
తనివి = సంతృప్తి;
జనింపదు = కలుగదు;
చెప్పగదే =
చెప్పుము; చెవులు = వీనుల;
నిండన్ = విందుగా;
శ్రీహరి = విష్ణుమూర్తి;
కథలున్ =
కథలను.
అని = అని; మఱియున్ = ఇంకను; అడుగంబడిన = అడుగబడిన;
వాడు = వాడు;
ఐ = అయ్యి; అతనిన్ = అతనిని;
అభినందించి = పొగిడి;
హరి = విష్ణుదేవుని;
ప్రసంగంబు = కథావిశేషములను;
చెప్పన్ =
చెప్పుటకు; ఉపక్రమించెన్ = పూనుకొనెను;
అని = అని; సూతుండు = సూతుడు;
ద్విజుల్ =
బ్రాహ్మణుల;
కున్ = కి; ఇట్లు = ఈ విధముగా;
అనియె = పలికెను;
అట్లు = ఆ విధముగ;
శుకుండు = శుకుడు;
రాజున్ = రాజును;
చూచి = చూసి.
భావము:
ఉత్తమ పండితుడవు
అయిన శుకమహర్షి! భగవంతుడి కథలు ఎన్ని
చెప్పినా నాకు తృప్తి కలగదు. చెవులారా వింటాను, విష్ణు కథలు ఇంకా చెప్పు.”
ఇలా అడిగిన
పరీక్షిత్తు మాటలు విని సంతోషించి
శుకమహర్షి విష్ణుకథలను చెప్పడానికి పూనుకున్నాడు” అని చెప్పి సూత మహర్షి శౌనకుడు మున్నగు మహర్షులతో మరల ఇలా
చెప్పసాగాడు “అప్పుడు శుక ముని
పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు
8-144-ka.
appaTinuMDi budhottama!
cheppeDu bhagavatkathaa visheShaMbulu naa
keppuDuM~ danavi janiMpadu
cheppaM~gade chevulu niMDa shreeharikathalun.
8-145-va.
ani maRriyu naDugaM baDinavaaM~Dai yatani
nabhinaMdiMchi hari prasaMgaMbu jeppa nupakramiMche" nani sootuMDu dvijula
kiTlaniye" naTlu shukuMDu raajuM joochi.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment