8-152-క.
వరదునిఁ బరము జగద్గురు
కరుణాపరతంత్రు మనము గనుఁగొన దుఃఖ
జ్వరములు చెడు నని సురలకు
సరసిజజని చెప్పి యజితు సదనంబునకున్.
టీకా:
వరదుని
= వరాలిచ్చెడివానిని;
పరమున్ = పరమాత్ముని;
జగద్గురున్ = లోకాలనుకాపాడువాడు
{గురువు - 1ఉపాధ్యాయుడు 2బృహస్పతి 3కులముపెద్ద 4తండ్రి 5తండ్రితోడబుట్టినవాడు
6తాత 7అన్న 8మామ 9మేనమామ 10రాజు 11కాపాడువాడు};
కరుణాపరతంత్రున్ = కృపావశీకరుని;
మనమున్ = మనమందరము;
కనుగొనన్ = దర్శించినచో;
దుఃఖ = శోకములు;
జ్వరములున్ =
బాధలు; చెడును = నశించును;
అని = అని; సురల్ = దేవతల;
కున్ = కు; సరసిజజని =
బ్రహ్మదేవుడు {సరసిజజని - సరసిజ (పద్మము)నందు జని
(పుట్టినవాడు), బ్రహ్మ};
చెప్పి = తెలిపి;
అజితుసదనంబున్ = వైకుంఠమున {అజితుసదనము - అజితు (జయింపరాని
వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము),
వైకుంఠము}; కున్ = కు.
భావము:
వరాలు
ఇచ్చే వాడు, పరమాత్ముడూ,
సకల లోకాలకు తండ్రి,
దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం
చేసుకుంటే, మన
దుఃఖాలు, బాధలూ అన్నీ దూరం అవుతాయి.” అని,
చెప్పి బ్రహ్మదేవుడు వేగంగా అజితుడు
అయిన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు.
8-152-ka.
varaduniM~ baramu jagadguru
karuNaaparataMtru manamu ganuM~gona du:kha
jvaramulu cheDu nani suralaku
sarasijajani cheppi yajitu sadanaMbunakun.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment