8-163-క.
పురుషోత్తమ! నీ రూపము
పరమశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్
స్థిరవైదిక యోగంబున
వరుసను మీ యంద కానవచ్చెను మాకున్.
8-164-క.
మొదలును నీలోఁ దోఁచెను;
దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను;
నీవే
మొదలు నడుమ దుది సృష్టికిఁ
గదియఁగ ఘటమునకు మన్ను గతి యగు మాడ్కిన్.
టీకా:
పురుషోత్తమ = నారాయణ
{పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు,
విష్ణువు}; నీ = నీ యొక్క;
రూపము =
స్వరూపము; పరమ = అత్యుత్తమమైన;
శ్రేయంబు = శుభప్రదమైనది;
భువన = లోకముల;
పంక్తుల్ = సమూహముల;
కున్ = కు; ఎల్లన్ = సమస్తమునకు;
స్థిర = చెదరని;
వైదిక =
వేదోక్త; యోగంబునన్ = యోగమువలన;
వరుసను = క్రమముగ;
మీ = మీ; అంద = లోనే;
కానవచ్చెను = కనబడెను;
మా = మా; కున్ = కు.
మొదలును = సృష్టికి
ఆది; నీ = నీ; లోన్ = అందే;
తోచెనున్ = కనబడెను;
తుదియునున్ = అంతముకూడ;
అటన్ =
అక్కడనే; తోచెన్ = కనబడెను;
నడుమన్ = రెంటిమధ్యదికూడ;
తోచెను = కనబడెను;
నీవే =
నీవుమాత్రమే;
మొదలు = ఆది;
నడుమ = మధ్య;
తుది = అంతములు;
సృష్టి = సృష్టి;
కిన్ = కి; కదియంగ = సరిగచూసినచో;
ఘటమున్ = కుండ;
కున్ = కు; మన్ను = మట్టి;
గతి =
కారణము; అగు = అయ్యెడి;
మాడ్కిన్ = వలె.
భావము:
ఓ పరమపురుషా! శ్రీమహావిష్ణూ! నీ రూపం సమస్తమైన భువనాలకూ
శ్రేయోదాయకం అయినది. ఆ రూపం శాశ్వతమైన వేద మంత్రంతో కూడి మీ యందే మాకు కనబడుచున్నది.
కుండకు మన్నే ఆధారం, కనుక కారణభూకం. దీనిని ఘటపటన్యాయం అంటారు. అలాగే, ఈ సృష్టికి మొదలూ, మధ్యభాగమూ, అంతమూ నీలోనే ప్రకాశితమవుతున్నాయి.
ఈ సృష్టి ఆది, మధ్య, అంతములు అను మూడు దశలకు కారణభూతం నీవే.
విశేషవివరణ = కుండలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్ని మట్టియొక్క రూపాలే, మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి; పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్ని దారాలయొక్క రూపాలే, దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం; ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం “ఘటపటన్యాయం”.
८-१६३-क.
पुरुषोत्तम!
नी रूपमु
परमश्रेयंबु
भुवन पंक्तुल केल्लन्
स्थिरवैदिक
यगंबुन
वरुसनु
मी यंद कानवच्चेनु माकुन्.
८-१६४-क.
मोदलुनु
नीलोँ दोँचेनु;
दुदियुनु
नटँ दोँचे; नडुम
दोँचेनु; नीवे
मोदलु
नडुम दुदि सृष्टिकिँ
गदियँग
घटमुनकु मन्नु गति यगु माड्किन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment