Saturday, May 21, 2016

క్షీరసాగరమథనం - వధ్యుండు

8-151-క.
ధ్యుండు రక్షణీయుఁడు
సాధ్యుఁడు మాన్యుఁడని లేక ర్గత్రాణా
ధ్యాదు లొనర్చు నతం
డాధ్యంత విధానమునకు ర్హుఁడు మనకున్.
టీకా:
          వధ్యుండు = వధింపదగినవాడు; రక్షణీయుడు = కాపాడదగినవాడు; సాధ్యుడు = దండింపదగినవాడు; మాన్యుడు = మన్నింపదగినవాడు; అని = అని; లేక = లేకుండగ; సర్గ = సృష్టించుట; త్రాణ = కాపాడుట; వధ్య = సంహరించుట; ఆదులు = మున్నగునవి; ఒనర్చు = చేసెడి; అతండు = అతడు; ఆధి = మనోవ్యధలను; అంత = పోగొట్టుటకై; విధానమున్ = పూజించుటకు; కున్ = కి; అర్హుడు = తగినవాడు; మన = మన; కున్ = కు.
భావము:
          భగవంతుడికి చంపదగినవాడు, కాపాడదగినవాడు, కష్టపెట్టదగినవాడు, గౌరవించదగినవాడు అనే తారతమ్య భేదం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మన మనోవ్యథలు పోగొట్టేవాడు. మనకు ఎల్లప్పుడూ ఆధారమైన వాడు.
8-151-ka.
vadhyuMDu rakShaNeeyuM~Du
saadhyuM~Du maanyuM~Dani leka sargatraaNaa
vadhyaadu lonarchu nataM
DaadhyaMta vidhaanamunaku narh~uM~Du manakun.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: