8-141-సీ.
చక్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ;
డాఱవ మనువయ్యె నవనినాథ!
డాఱవ మనువయ్యె నవనినాథ!
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు;
లాతని నందను; లమరవిభుఁడు
లాతని నందను; లమరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ; డమర్త్యు లాప్యాదికు;
లాహవిష్మద్వీరకాది ఘనులు
లాహవిష్మద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజు;
నకుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె;
నకుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె;
8-141.1-ఆ.
నతఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని;
నుదధి జలములోన నుండి మోచె;
నుదధి జలములోన నుండి మోచె;
నతఁడు చువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిఁ;
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
టీకా:
చక్షుస్ = చక్షుస్సు
యొక్క; తనూజుండు = పుత్రుడు;
చాక్షుసుండు = చాక్షుషుడు;
అను = అనెడి;
వీరుడు =
శ్రేష్ఠుడు;
ఆఱవ = అరో (6);
మనువు = మనువు;
అయ్యెన్ = అయ్యెను;
అవనినాథ = రాజ;
భూమీశ్వరులు = రాజులు;
పురుః = పురువు;
పురుష = పురుషుడు;
సుద్యుమ్న =
సుద్యుమ్నుడు;
ఆదులు = మొదలగువారు;
ఆతని = అతని యొక్క;
నందనులు = పుత్రులు;
అమరవిభుడు = ఇంద్రుడు;
మంత్రద్యుమ్న = మంత్రద్యుమ్నుడు అను;
ఆఖ్యుడు =
పేరుగలవాడు;
అమర్త్యులు = దేవతలు;
ఆప్యా = ఆప్యాయుడు;
ఆదికులు = మొదలైనవారు;
ఆ =
ఆ; హవిష్మత్ = హవిష్మంతుడు;
వీరక = వీరకుడు;
ఆది = మున్నగు;
ఘనులు = గొప్పవారు;
మునులు = సప్తర్షులు;
విభుడు = విష్ణుమూర్తి;
సంభూతి = సంభూతి;
కిన్ = కి; వైరాజున్ = వైరాజున;
కున్ = కు; పుట్టి = పుట్టి;
అజితుండు = అజితుడు;
నాగ =
అనగా; ఒప్పెన్ = ఒప్పియుండెను;
అతడు = అతడు.
కాడె = కాదా;
కూర్మము = కూర్మావతారుడు;
ఐ = అయ్యి; మందర = మందర యనెడి;
అద్రిని = పర్వతమును;
ఉదధి = సముద్ర;
జలము = నీటి;
లోనన్ = లోపల;
ఉండి = ఉండి;
మోచెన్ = మోసెను;
అతడు = అతడు; చువ్వె = సుమా;
దివిజులు = దేవతలు;
అర్థింపన్ = కోరగా;
అమృతాబ్దిన్ =
పాలసముద్రమును;
త్రచ్చి = చిలికి;
ఇచ్చెన్ = ఇచ్చెను;
ఆ = ఆ; సుధారసంబున్ =
అమృతమును.
భావము:
పరీక్షిత్తు
మహారాజా! ఆరవ మనువుగా,
చక్షువు అను వాని పుత్రుడు చాక్షుషుడు
అయ్యాడు. ఆ చాక్షుస మన్వంతరంలో, అతని
కొడుకులు అయిన పురుడు, పురుషుడు , సుద్యుమ్నుడు మున్నగువారు
రాజులు అయ్యారు;
మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు;
ఆప్యాదులు దేవతలు అయ్యారు.
హవిష్మంతుడు,
వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు;
వైరాజుకీ సంభాతికీ
“అజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు.
అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. దేవతలు
ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు.
విశేష వివరణ=
చతుర్దశ మన్వంతరాలలో నాలుగవది (4)
అయిన, తామస మన్వంతరంలో గజేంద్ర మోక్షం ఘట్టం
జరిగింది. తరువాత అయిదవది (5)
అయిన రైవత మన్వంతరం,
ఆ తరువాతది ఆరవది అయిన
చాక్షుస మన్వంతరం. ఈ మన్వంతరంలో
క్షీరసాగర మధనం జరిగింది. ఆ పిమ్మట వచ్చినది
ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వత మన్వంతరం.
8-141-see.
chakShustanoojuMDu chaakShuShuM Danu veeruM~;
DaaRrava manuvayye navaninaatha!
bhoomeeshvarulu puru: puruSha sudyumnaadu; laatani
naMdanu; lamaravibhuM~Du
maMtradyumaakhyuM~; Damartyu laapyaadiku;
laahaviShmadveerakaadi ghanulu
munulaMdu vibhuM~Du saMbhootiki vairaaju; nakuM~
buTTi yajituMDu naaM~ga noppe;
8-141.1-aa.
nataM~Du kaaM~De koormamai maMdaraadrini; nudadhi
jalamulona nuMDi mOche;
nataM~Du chuvve diviju larthiMpa namRitaabdhiM~;
drachchi yichche naa sudhaarasaMbu.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment