Sunday, May 29, 2016

క్షీరసాగరమథనం – నీ మాయ చేత

8-165-క.
నీ మాయ చేత విశ్వము
వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్
ధీమంతులు గుణపద విని
నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్.
8-166-ఆ.
న్న మవని యందు మృతంబు గోవుల
యందు వహ్ని సమిధలందు నమర
యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే
గుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు.
టీకా:
            నీ = నీ యొక్క; మాయ = మాయ; చేత = వలన; విశ్వము = భువనము; వేమాఱు = అనేకసార్లు; సృజింతువు = సృష్టించెదవు; అనుచున్ = అనుచు; విష్ణుడవు = విశ్వమును వ్యాపించి యుండు వాడవు; అనుచున్ = అనుచు; ధీమంతులు = జ్ఞానులు; గుణ = గుణములందలి; పదవిన్ = సంపదవలన; నేమంబునన్ = నియమములతో; సగుణుండు = గుణములుగలవాడు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; కాంతురు = దర్శింతురు; ఒగిన్ = క్రమముగ.
            అన్నము = ఆహారమును; అవని = భూమి; అందున్ = లోను; అమృతంబు = పాలను; గోవుల = ఆవుల; అందున్ = లోను; వహ్ని = అగ్నిని; సమిధలు = కట్టెల; అందున్ = లోను; అమరన్ = పొందికైన; యోగవశతన్ = యోగసాధనవలన; పొందు = పొందెడి; ఓజనున్ = ప్రకాశముతోకలిగిన; బుద్ధి = తెలివి; చేన్ = చేత; అగుణున్ = గుణరహితుని; నిన్నున్ = నిన్ను; కాంతురు = దర్శించెదరు; ఆత్మవిదులు = ఆత్మజ్ఞానులు.
భావము:
            ప్రపంచాన్ని నీ మాయచేత అనేక మార్లు సృష్టించి, త్రిగుణాలతో కూడినవాడవై ప్రపంచమంతా నిండి వుంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ, గుణవంతుడవైన నిన్ను దర్శిస్తారు.
                        భూమిలో ఆహారాన్నీ, ఆవులలో పాలనూ, కర్రలలో అగ్నిని కనుగొనే విధంగానే ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధిద్వారా గుణరహితుడవైన నిన్ను ఈ విశ్వంలో దర్శిస్తారు.

८-१६५-क.
नी माय चेत विश्वमु
वेमार्रु सृजिंतु वनुचु विष्णुँड वनुचुन्
धीमंतुलु गुणपद विनि
नेमंबुन सगुणुँडैन निनुँ गांतु रोगिन्.
८-१६६-आ.
अन्न मवनि यंदु नमृतंबु गोवुल
यंदु वह्नि समिधलंदु नमर
योगवशतँ बोंदु नोजनु बुद्धिचे
नगुणु निन्नुँ गांतु रात्मविदुलु.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: