7-374-ఆ.
నరుఁడు
ప్రియముతోడ నాయవతారంబు,
నీ యుదారగీత నికరములను
మానసించునేని మఱి
సంభవింపఁడు
కర్మబంధచయముఁ గడచిపోవు.
7-375-వ.
అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీకా:
నరుడు
= మానవుడు; ప్రియము = ఆదరము; తోడన్
= తోటి; నా = నా యొక్క; అవతారంబున్
= అవతారమును; నీ = నీ యొక్క; ఉదార =
గొప్ప; గీత = కీర్తిగానముల; నికరములనున్
= సమూహములను; మానసించునేని = తలపోసినచో; మఱి =
ఇంక; సంభవింపడు = పుట్టడు; కర్మ =
కర్మముల; బంధ = బంధనముల; చయమున్
= సర్వమును; కడచిపోవు = దాటేయును.
అనినన్
= అనగా; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు
= ఇలా; అనియె = అనెను.
భావము:
మానవుడు నా ఈ నారసింహావతారాన్నీ, నీవు చేసిన ఈ సంస్తుతినీ నిండుగా
మనసులో నిలుపుకుంటే, వానికి పునర్జన్మ ఉండదు. వాడు కర్మ
బంధాలను దాటేస్తాడు.”
అలా పరమపురుషుడు పలుకగా. ప్రహ్లాదుడు
ఇలా అన్నాడు
७-३७४-आ.
नरुँडु प्रियमुतोड नायवतारंबु,
नी युदारगीत निकरमुलनु
मानसिंचुनेनि मर्रि संभविंपँडु
कर्मबंधचयमुँ गडचिपोवु.
७-३७५-व.
अनिनँ ब्रह्लादुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment