Monday, May 23, 2016

క్షీరసాగరమథనం - ఎవ్వని మాయకు

బ్రహ్మాదులహరిస్తుతి
8-153-వ.
అంత దానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునఁ గానంబడని యవ్విభు నుద్ధేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె.
8-154-సీ.
వ్వని మాయకు నింతయు మోహించుఁ
ఱమి యెవ్వని మాయ దాఁ రాదు
మాయ నెవ్వఁ డింయు గెల్చినట్టివాఁ
డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు
ర్వభూతములకు మవృత్తి నెవ్వఁడు
రియించుఁ దనచేత నితమయిన
రణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ము
ఖంబు గన్నులు సోమమలహితులు;
8-154.1-తే.
చెవులు దిక్కులు; రేతంబు సిద్ధజలము
మూఁడు మూర్తులపుట్టిల్లుమొదలి నెలవు
ర్భమఖిలంబు; మూర్థంబు గన మగుచు
లయు నెవ్వఁడు వాని నస్కరింతు.
టీకా:
          అంతన్ = అంతట; తానును = అతను; దేవతా = దేవతల; సమూహంబునున్ = సమూహము; అతి = మిక్కిలి; రయంబునన్ = వేగముగా; చని = వెళ్ళి; వినయంబునన్ = వినమ్రతతో; కానంబడని = కనబడని; ఆ = ఆ; విభునిన్ = స్వామిని; ఉద్దేశించి = గురించి; దైవికంబులు = దివ్యములైనవి; అగు = అయిన; వచనంబులన్ = పలుకులతో; నియతేంద్రియుండు = ఏకాగ్రచిత్తముగలవాడు {నియతేంద్రియుడు - నియత (నియమింపబడిన) ఇంద్రియుడు (ఇంద్రియములుగల వాడు), ఏకాగ్రచిత్తుడు}; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అని = అనుచు; స్తుతియించెన్ = ప్రార్థించెను.
          ఎవ్వని = ఎవని యొక్క; మాయ = మాయ; కున్ = కు; ఇంతయున్ = ఈ సృష్టియంతయు; మోహించున్ = మోహములోపడును; తఱమి = ప్రయత్నించినను; ఎవ్వని = ఎవనియొక్క; మాయన్ = మాయను; దాటన్ = దాటుటకు; రాదు = వీలుకాదో; తన = తన యొక్క; మాయన్ = మాయచేత; ఎవ్వడు = ఎవరైతే; ఇంతయున్ = ఈ సృష్టియంతటిని; గెల్చిన = జయించిన; అట్టి = అటువంటి; వాడు = వాడో; ఎవ్వని = ఎవని; పొడగానరు = జాడపట్టుకొనలేరో; ఎట్టి = ఎటువంటి; మునులు = ఋషులైనను; సర్వ = అఖిలమైన; భూతముల్ = జీవుల; కున్ = ఎడల; సమవృత్తిన్ = ఒకేవిధముగ; ఎవ్వడు = ఎవరైతే; చరియించున్ = మెలగుతాడో; తన = తన; చేతన్ = చేత; జనితము = సృష్టింపబడినది; అయిన = ఐన; ధరణి = భూమండలము; పాదములు = పాదములు; చిత్తము = మనసు; సోముడు = శివుడు; అగ్ని = అగ్నిదేవుడు; ముఖంబున్ = వదనము; కన్నులు = కళ్ళు; సోమ = చంద్రుడు; కమలహితులు = సూర్యుడు {కమలహితుడు - కమలములకు ప్రీతిపాత్రుడు, సూర్యుడు}. 
          చెవులు = చెవులు; దిక్కులు = దిక్కులు; రేతంబున్ = వీర్యము; సిద్ధ = సిద్దముగ; జలము = నీరు; మూడుమూర్తుల = త్రిమూర్తుల యొక్క {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; పుట్టిల్లు = జన్మస్థానమునీస్వరూపం; మొదలి = సృష్టికి మూల; నెలవు = ఆధారము; గర్భము = కడుపు; అఖిలంబున్ = సమస్తమునకు; మూర్థంబు = శిరస్సు; గగనము = ఆకాశము; అగుచున్ = అగుచు; మలయున్ = వ్వాపించి ఉండునో; వాని = అతనిని; నమస్కరింతు = ప్రార్థింతును.
భావము:
            అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్ళి ఏకాగ్రచిత్తంతో అదృశ్యరూపుడు అయిన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాడు.
            భగవాన్! నీ మాయ వలన సృష్టి సమస్తమూ మోహంలో మునిగిపోతుంది; నీ మాయను దాటడం ఎవరి వల్లా కాదు, ఏమాత్రం నీ మాయను గెలిచినవారు ఎవరూ లేరు; నీవు ప్రాణులు అందరి ఎడల సమానంగా మెలగువాడవు; నీ వల్ల పుట్టిన భూమి నీ పాదాలు; శివుడు నీ మనస్సు; అగ్ని నీ ముఖము; సూర్యచంద్రులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; జలం నీ వీర్యం; త్రిమూర్తులుకి నీ రూపం పుట్టిల్లు; సృష్టి సమస్తమునకు మూలాధారం నీ కడుపు; ఆకాశం నీ శిరస్సు; విధంగా విశ్వరూపుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను.
८-१५३-व.
अंत दानुनु देवतासमूहंबुनु नतिरयंबुनं जनि विनयंबुनँ गानंबडनि यव्विभु नुद्धेशिंचि दैविकंबुलगु वचनंबुल नियतेंद्रियुंडै यिट्लनि स्तुतियिंचे.
८-१५४-सी.
एव्वनि मायकु निंतयु मोहिंचुँ;
दर्रमि येव्वनि माय दाँट रादु;
तन माय नेव्वँ डिंतयु गेल्चिनट्टिवाँ;
डेव्वनिँ बोडगान रेट्टि मुनुलु;
सर्वभूतमुलकु समवृत्ति नेव्वँडु;
चरियिंचुँ दनचेत जनितमयिन;
धरणि पादमुलु चित्तमु सोमुँ डग्नि मु;
खंबु गन्नुलु सोमकमलहितुलु;
८-१५४.१-त.
चेवुलु दिक्कुलु; रेतंबु सिद्धजलमु;
मूँडु मूर्तुलपुट्टिल्लु; मोदलि नेलवु
गर्भमखिलंबु; मूर्थंबु गगन मगुचु;
मलयु नेव्वँडु वानि नमस्करिंतु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: