8-161-సీ.
హార కిరీట కేయూర కుండల పాద;
కటక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ;
చక్ర శరాసన సంయుతంబు
మరకతశ్యామంబు సరసిజ నేత్రంబుఁ;
గర్ణాభరణ కాంతి గండ యుగముఁ
గలిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు;
శ్రీ వన మాలికా సేవితంబు
8-161.1-ఆ.
నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు హర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.
టీకా:
హార = హారములు;
కిరీట = కిరీటములు;
కేయూర = భుజకీర్తులు;
కుండల = చెవికుండలములు;
పాదకటక = కాలి
అందెలు; కాంచీలత = మొలతాడు;
కంకణ = కంకణములు;
ఆది = మున్నగునవి;
కౌస్తుభ =
కౌస్తుభమణితో;
ఉపేతంబున్ = కూడినది;
కౌమోదకీ = కౌమోదకీ గద;
శంఖ = శంఖము;
చక్ర =
చక్రము; శరాసన = విల్లు;
సంయుతంబున్ = కలిగినది;
మరకత = మరకతమణివంటి;
శ్యామంబున్
= నల్లనిమేనుగలది;
సరసిజ = పద్మములవంటి;
నేత్రంబున్ = కన్నులుగలది;
కర్ణాభరణ =
చెవికుండలముల;
కాంతిన్ = కాంతులుగల;
గండ = చెక్కళ్ళ;
యుగమున్ = జంట;
కలిత =
మనోహరమైన; కాంచన = బంగారు;
వర్ణ = రంగుగల;
కౌశేయ = పట్టు;
వస్త్రంబున్ = బట్టలు;
శ్రీవనమాలికా = వైజయంతిమాలచేత;
సేవితంబున్ = కొలువబడుచున్నది;
ఐ = అయ్యి.
మనోహరంబున్ =
మనోహరమైనది;
ఐ = అయ్యి; దివ్య = గొప్ప;
సౌభాగ్యము = సౌభాగ్యవంతము;
ఐన =
అయినట్టి; అతని = అతని;
రూపు = ఆకృతి;
హర్షము = సంతోషము;
ఎసగన్ = అతిశయించగా;
చూచి = చూసి;
బ్రహ్మ = బ్రహ్మదేవుడు;
హరుడు = పరమశివుడు;
సురలునున్ = దేవతలు;
తానునున్ = తను;
పొంగి = సంతోషిముతో పొంగిపోయి;
నమ్రుడు = నమ్రతచూపువాడు;
అగుచున్ = అగుచు;
పొగడన్ = స్తుతించుట;
తొడగెన్ = ప్రారంభించెను.
భావము:
భగవంతుడు
శ్రీహరి హారాలూ, కిరీటాలూ, భుజకూర్తులూ, కుండలాలూ, కాలి అందెలూ, మొలనూలూ, కంకణాలూ, కౌస్తుభరత్నమూ, కొమోదకీ గదా, శంఖమూ, చక్రమూ, విల్లూ ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేనూ, కాంతులీనే పద్మాల వంటి కళ్ళూ, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ
కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు.
మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడూ, శివుడూ, దేవతలూ సంతోషంతో
పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి
నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు.
८-१६१-सी.
हार
किरीट केयूर कुंडल पाद;
कटक
कांचीलता कंकणादि
कौस्तुभोपतंबुँ
गौमोदकी शंख;
चक्र
शरासन संयुतंबु
मरकतश्यामंबु
सरसिज नेत्रंबुँ;
गर्णाभरण
कांति गंड युगमुँ
गलित
कांचनवर्ण कौशेयवस्त्रंबु;
श्री वन
मालिका सेवितंबु
८-१६१.१-आ.
नै
मनोहरंबुनै दिव्यसौभाग्य
मैन
यतनि रूपु हर्ष मेसँग
जूचि
ब्रह्म हरुँडु सुरलुनु दानुनु
बोंगि
नम्रुँ डगुचुँ बोगडँ दोडँगे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment