Tuesday, May 17, 2016

క్షీరసాగరమథనం - సురపతి

8-147-క.
సుపతి వరుణాదులతో
సుముఖ్యులు గొంద ఱరిగి సురశైలముపై
సునుతుఁడగు నజుఁ గని యా
సు దుష్కృతిఁ జెప్పి రపుడు సొలయుచు నతులై.
టీకా:
          సురపతి = ఇంద్రుడు {సురపతి - సుర (దేవతల) పతి (ప్రభువు), ఇంద్రుడు}; వరుణ = వరుణుడు {వరుణుడు - జనులచే వరములు కోరబడువాడు - పడమటి వేలుపు}; ఆదులు = మున్నుదువారి; తోన్ = తోటి; సుర = దేవతలలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కొందఱున్ = కొంతమంది; సురశైలమున్ = మేరుపర్వతము; పైన్ = మీది; సుర = దేవతలచే; నుతుడు = స్తుతింపబడువాడు; అగు = అయిన; అజున్ = పరమశివుని {అజుడు - జన్మములేనివాడు, శివుడు}; కని = దర్శించి; ఆసుర = రాక్షసుల యొక్క; దుష్కృతిన్ = దుండగములను; చెప్పిరి = చెప్పిరి; అపుడు = అప్పుడు; సొలయుచున్ = సోలిపోతూ; నతులు = స్తుతించువారు; ఐ = అయ్యి.
భావము:
          అలాంటి యుద్దాల సందర్భంలో, వరుణుడు మున్నగు దేవతా ప్రముఖులతో కూడి, దేవేంద్రుడు మేరుపర్వతానికి వెళ్లాడు. అక్కడ దేవతలకు పెద్ద అయిన బ్రహ్మదేవుని దర్శించి నమస్కారం చేశాడు. దేవతలు అందరూ ఆయనకు రాక్షసుల దురాగతాలను ఇలా వివరించారు.
          సహజకవి బమ్మెరపోతనామాత్యులవారి గంటంనుండి జాలువారిన అమృతం బొట్టు కందపద్యం అయింది. సుర సుర అంటూ అరడజను సార్లు వాడి, దేవతలు వారున్న పరిస్థితిని అనుసరించి, సుర సుర లాడుతూ చర చర వెళ్ళారు. అని చెప్తున్నారా? ఇలా అద్భుతమైన యమకాలంకారంతో అలంకరించబడిన పద్యం ఇది.
8-147-ka.
surapati varuNaadulato
suramukhyulu goMda Rrarigi surashailamupai
suranutuM~Dagu najuM~ gani yaa
sura duShkRitiM~ jeppi rapuDu solayuchu natulai.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: