8-168-మత్త.
నీకు నే మని విన్నవింతుము నీవు సర్వమయుండవై
లోకమెల్లను నిండి యుండగ లోకలోచన! నీ పదా
లోకనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నాకవాసులు నీవ వహ్నిఁ దనర్చు కేతుతతిక్రియన్.
8-169-వ.
అని
కమలసంభవ ప్రముఖులు వినుతి చేసి రని"
చెప్పి
నరేంద్రునకు శుకుం డిట్లనియె.
టీకా:
నీ = నీ; కున్ = కు; ఏమని = ఏమని;
విన్నవింతుము = మనవిచేసుకొనెదము;
నీవు = నీవు;
సర్వ = అన్నిటను;
మయుండవు = ఉండెడివాడవు;
ఐ = అయ్యి; లోకము = లోకము;
ఎల్లను = అంతటను;
నిండి =
నిండి; ఉండగన్ = ఉండగా;
లోక = లోకములను;
లోచన = సదావీక్షించువాడ;
నీ = నీ యొక్క;
పద = పాదములను;
ఆలోకనంబు = దర్శించుట;
శుభంబు = శుభము;
మా = మా; కును = కు; లోకపాలకుల్ = లోకపాలకులు;
ఏనున్ = నేను;
ఈ = ఈ; నాకవాసులు = దేవతలు {నాకవాసులు -
నాకము (స్వర్గలోకము)న వాసులు
(నివసించెడివారు), దేవతలు};
నీవ = నీవే;
వహ్నిన్ =
అగ్నియందు; తనర్చు = అతిశయించెడి;
కేతు = అగ్నికణముల,
కాంతి; తతి = సమూహము;
క్రియన్ = వలె.
అని = అని; కమలసంభవ = బ్రహ్మదేవుడు;
ప్రముఖులు = మొదలగువారు;
వినుతి = స్తోత్రము;
చేసిరి = చేసిరి;
అని = అని; చెప్పి = చెప్పి;
నరేంద్రున్ = నరేంద్రున;
కున్ = కు; శుకుండు =
శుకుడు; ఇట్లు = ఈ విధముగ;
అనియె = పలికెను.
భావము:
శ్రీమన్నారాయణా! లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు. లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ
ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ
పాదదర్శనం మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని స్పులింగాలవలె నేనూ, ఈ లోకపాలకులూ, దేవతలూ నీలోని అంశలమే.”
ఇలా విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగు దేవతా ప్రముఖులు
శ్రీమహావిష్ణువును ప్రార్థించారు” అని చెప్పి శుకమహర్షి
పరీక్షిన్మహారాజుకు మరల ఇలా చెప్పసాగాడు.
८-१६८-मत्त.
नीकु ने
मनि विन्नविंतुमु नीवु सर्वमयुंडवै
लोकमेल्लनु
निंडि युंडग लोकलोचन! नी पदा
लोकनंबु
शुभंबु माकुनु लोकपालकु लेनु नी
नाकवासुलु
नीव वह्निँ दनर्चु केतुततिक्रियन्.
८-१६९-व.
अनि
कमलसंभव प्रमुखुलु विनुति चेसि रनि" चेप्पि नरेंद्रुनकु शुकुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :