Thursday, April 9, 2015

కృష్ణలీలలు

10.1-346-కంద పద్యము
నా గడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధముఁ గని
యేఱితిమి గాక యీశుఁ డీతఁడు మాకున్.
          ఇలా ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
          ఈ బాలకుని నిండు ముఖాన్ని చూసి నేను, నా భర్త, ఈ వ్రేపల్లెలోని గోపగోపికా జనాలు అందరం, చివరకు గోవులుకూడ ఇతడు బాలుడే అని భ్రాంతి పడ్డాం కాని, ఇతడు మా కందరికి ప్రభువైన ఈశ్వరుడు అని గుర్తించలేకపోయాం.    
10.1-346-kaMda padyamu
naa magaDu nEnu gOvulu
nee maMdayu gOpajanulu nibbaaluni ne
mmOmuna nunna vidhamuM~ gani
yEmaRritimi gaaka yeeshuM~ DeetaM~Du maakun.
          నా = నా యొక్క; మగడు = భర్త; నేనున్ = నేను; గోవులున్ = పశువులు; = ; మందయున్ = పల్లె; గోపజనులును = యాదవులు; = ; బాలుని = పిల్లవాని; నెఱ = నిండైన; మోమునన్ = ముఖము నందు; ఉన్న = ఉన్న; విధమున్ = విధానమును; కని = చూసి; ఏమఱితిమి = భ్రమ పడితిమి; కాక = తప్పించి; ఈశుడు = భగవంతుడు; ఇతడున్ = ఇతను; మా = మా అందరి; కున్ = కి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: