10.1-366-కంద పద్యము
లాలనమున బహుదోషము
లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్
జాల గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ పథ్యం బరయన్.
గారాబం మరీ ఎక్కువ
చేస్తే పిల్లలు చివరికి చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తుంటే మంచి గుణాలు
అలవడతాయి. పిల్లల మితిమీరే అల్లరికి చక్కిటి ఔషధం దండోపాయం.
“దండం దశగుణ భవేత్” అంటారు కదా. కొంటె కృష్ణుని అల్లరి కళ్ళారా చూసిన తల్లి యశోద భావాలను ప్రజాకవి
పోతన ఎంతో సహజసిద్ధంగా చెప్పిన పద్యం.
10.1-366-kaMda padyamu
laalanamuna bahudOShamu
lOliM braapiMchuM~ daaDanOpaayamulan
jaala guNaMbulu galugunu
baalurakunu daaDanaMba pathyaM barayan.
లాలనమునన్ = గారాబముచేత; బహు = అనేకమైన; దోషములు = లోపములు; ఓలిన్ = క్రమముగా; ప్రాపించున్ = కలుగును; తాడనోపాయములన్ = దండోపాయములచేత; చాలన్ = మిక్కిలిగ; గుణంబులున్ = సుగుణములు; కలుగును = లభించును; బాలుర = మగపిల్లల; కును = కు; తాడనంబ = కొట్టిదండించుటయే; పథ్యంబు = తగినపని, మందు; అరయన్ = తరచిచూసినచో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment