10.1-361-ఆటవెలది
వికచకమలనయన వే ఱొక యింటిలో
వెలయ ఱోలు దిరుగవేసి యెక్కి
యుట్టిమీఁది వెన్న నులుకుచు నొక కోఁతి
పాలు చేయుచున్న బాలుఁ గనియె.
ఇంట్లో పెరుగుకుండ పగలగొట్టిన కృష్ణుడు,
అక్కడ మరొక ఇంటిలో ఒక రోలుని తిరగేసి, చక్కగా దానిమీద ఎక్కాడు. ఉట్టిమీద ఉన్న
వెన్నతీసి బెదురుతూనే ఒక కోతికి పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చి అతడు చేస్తున్న ఆ
అల్లరి పని చూసింది.
10.1-361-aaTaveladi
vikachakamalanayana vE Rroka yiMTilO
velaya RrOlu dirugavEsi yekki
yuTTimeeM~di venna nulukuchu noka kOM~ti
paalu chEyuchunna baaluM~ ganiye.
వికచకమలనయన = పడతి, యశోద {వికచకమలనయన - విరిసిన పద్మముల వంటి కన్నులు గలామె,
స్త్రీ}; వేఱొక = మరొకరి; ఇంటి = నివాసము; లోన్ = అందు; వెలయన్ = చక్కగా; ఱోలున్ = రోటిని; తిరుగవేసి = తిరగేసి; ఎక్కి = పైకెక్కి; ఉట్టి = ఉట్టి {ఉట్టి - పాలు
పెరుగాదులు వేళ్ళాగ గట్టబడెడి చిక్కము}; మీది = పైనున్న; వెన్నన్ = వెన్నను; ఉలుకుచున్ = బెదురుతూ; ఒక = ఒకానొక; కోతి = కోతి; పాలున్ = కిపెట్టుట; చేయుచున్న = చేస్తున్న; బాలునిన్ = పిల్లవానిని; కనియెన్ = చూసెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment