10.1-343-ఆటవెలది
బాలమాత్రుఁడగు
సలీలుని ముఖమందు
విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు
బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స
ర్వాత్ముఁ
డాది విష్ణుఁ డగుట నిజము.
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా
అనుకుంటోంది.
ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా
ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు
ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే.
ఇదే ముమ్మాటికీ నిజం.
10.1-343-aaTaveladi
baalamaatruM~Dagu saleeluni mukhamaMdu
vishva mella neTlu velasi yuMDu
baalu bhaMgi nitaM~Du bhaasilluM~ gaani sa
rvaatmuM~ Daadi viShNuM~ DaguTa nijamu.
బాల = సామాన్య బాలునికి;
మాత్రుడు = సమానమైనవాడు; అగు = ఐన; సలీలుని = లీలతో కూడియున్నవాని; ముఖము = ముఖము; అందున్ = లో; విశ్వము = భువనభాండము; ఎల్లన్ = అంతా; ఎట్లు = ఏ విధముగ; వెలసి = విలసిల్లి; ఉండున్ = ఉండగలదు; బాలున్ = పిల్లవాని; భంగిన్ = వలె; ఇతడు = ఇతను; భాసిల్లున్ = ప్రకాశించును; కాని = కాని; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వమునందు (ఆత్మగా) నుండెడి వాడు, విష్ణువు}; ఆదివిష్ణుడు = నారాయణుడు {ఆదివిష్ణుడు - మూలాదారమైన సర్వవ్యాపకుడు, విష్ణువు}; అగుటన్ = ఐ ఉండుట; నిజము = తథ్యము.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment