Saturday, April 4, 2015

కృష్ణలీలలు

10.1-339-వచనము
అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజబాలకుండైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన
          అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన కృష్ణబాలుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు.
10.1-339-vachanamu
ani paliki neyyaMbuna nayyavva niyyakolipi kreeDaamanujabaalakuMDaina yeeshvaruMDu tana nOru deRrachi mukhaMbuM~ joopina
          అని = అని; పలికి = చెప్పి; నెయ్యంబున్ = ఇంపుగా; = ఆ యొక్క; అవ్వన్ = తల్లిని; ఇయ్యకొలిపి = ఒప్పించి; క్రీడా = విలాసార్థము; మనుజ = మానవునిగా అవతరించిన; బాలకుండు = పిల్లవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; నోరున్ = నోటిని; తెఱచి = తెరచి; ముఖంబున్ = ముఖమును; చూపినన్ = చూపించగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: