Saturday, April 11, 2015

కృష్ణలీలలు

10.1-349-వచనము
అనిన విని రాజిట్లనియె.
10.1-350-ఆటవెలది
గదధీశ్వరునకుఁ న్నిచ్చు తల్లి గా
నేమి నోము నోఁచె నీ యశోద?
పుత్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రి గా
నందుఁ డేమి చేసె? నందితాత్మ.
         ఇలా శుకమహర్షి యశోద బాలకృష్ణుని ముద్దు చేస్తోంది అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
         శుకమహర్షీ! నీవు ఆత్మానందం పొందిన వాడవు. ఈ లోకాలన్నిటికీ ప్రభువూ భగవంతుడూ అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో? శ్రీ హరిని పొషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేశాడో? 
10.1-349-vachanamu
anina vini raajiTlaniye.
10.1-350-aaTaveladi
jagadadheeshvarunakuM~ jannichchu talli gaa
nEmi nOmu nOM~che nee yashOda?
putruM~ Danuchu nataniM~ bOShiMchu taMDri gaa
naMduM~ DEmi chEse? naMditaatma.
         అనినన్ = అనగా; విని = విని; రాజు = పరీక్షిత్తు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            జగదధీశ్వరున్ = హరి {జగదధీశ్వరుడు - జగత్ (లోకము) లన్నిటికి అధీశ్వరుడు (సర్వోత్కృష్ట అదిపతి), విష్ణువు}; కున్ = కి; చన్ను = చనుబాలు; ఇచ్చు = తాగించెడి; తల్లి = అమ్మ; కాన్ = అగుటకు; ఏమి = ఎట్టి; నోమున్ = నోములను; నోచెన్ = చేసెనో; = ; యశోద = యశోద; పుత్రుడు = కుమారుడు; అనుచున్ = అంటూ; అతనిన్ = అతనిని; పోషింపన్ = పెంచుటకు; తండ్రి = తండ్రి; కాన్ = అగుటకు; నందుడు = నందుడు; ఏమి = ఎట్టి (పుణ్యములు); చేసెన్ = చేసెను; నందితాత్మ = శుకయోగి {నందితాత్మ - ఆనందమున ఉన్న ఆత్మ కలవాడు, శుకుడు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: