10.1-375-కంద పద్యము
పట్టినఁ బట్టుపడని నినుఁ
బట్టెద నని చలముఁగొనినఁ పట్టుట బెట్టే?
పట్టువడ వండ్రు పట్టీ
పట్టుకొనన్ నాఁకుఁగాక పరులకు వశమే?
పట్టుకుందామంటే
ఎవరికీ చిక్కనని అనుకుంటున్నావా. పట్టుకోవాలని నేను పట్టుబడితే నువ్వు దొరకటం పెద్ద కష్టం అనుకుంటున్నావా. నువ్వు చిక్కవు
అని అందరూ అంటారు. నిన్ను పట్టుకోడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదురా.
అసలు తత్వం
కూడా ఆ మహాతల్లి యశోదమ్మ నోట అంతరార్థంగా ఇలా బయటబడుతోంది.
10.1-375-kaMda padyamu
paTTinaM~ baTTupaDani ninuM~
baTTeda nani chalamuM~goninaM~ paTTuTa beTTE?
paTTuvaDa vaMDru paTTee
paTTukonan naaM~kuM~gaaka parulaku vashamE?
పట్టినన్ = పట్టుకొన్నను; పట్టుబడని = చిక్కని; నినున్ = నిన్ను; పట్టెదన్ = పట్టుకుంటాను; అని = అని; చలము = పట్టుదల; కొనిన = పట్టినచో; పట్టుట = పట్టుకొనుట; బెట్టే = ఏమైనా ఘనకార్యమా; పట్టువడవు = చిక్కవు; అండ్రున్ = అనెదరు; పట్టీ = కొడుకా; పట్టుకొనన్ = పట్టుకొనుటకు; నా = నా; కున్ = కు; కాక = తప్పించి; పరులు = ఇతరుల; కున్ = కు; వశమే = శక్యమే.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment