Saturday, April 25, 2015

=శ్రీ వేంకటేశ్వరా విద్యాలయము, కొత్త ఢిల్లీ.=

         ఈ రామానుజ జయంతి . . 2015,ఏప్రిల్-24 నాకు మరపురాని రోజు. మా నల్లనయ్య అనుగ్రహం ప్రదర్శిత మైన శుభదినం.
పండితవరేణ్యులు, పూజ్యులు, పరమ భాగవతులు, అస్మద్గురుతుల్యులు Elchuri Muralidhara Rao వారి విద్యాలయంలో కీశే. అజ్జరపు వేంకటరావు (నిర్మలం) వారి రామచరితం పుస్తక ఆవిష్కరణ అని చూసి మేం ఇద్దరం వెళ్ళాం. . సభ ఆత్మీయతలను పంచుకుంటూ బహు మనోరంజకంగా జరిగింది. . ఆచార్యులు చంద్రశేఖరు వారి పదవీవిరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. 
  Madabhushi Sridhar వారు మరికొందరు మహానుభావులను వినే భాగ్యం కలిగింది. ఆంధ్ర మహాసభ రంగయ్యగారు, 
Venkata Ramana Abbaraju వంటి విజ్ఞులు కూడా వచ్చారు. ఏల్చూరి వారు ఔదార్యంతో నన్ను, నా భుజాన్ని అలంకరించి ఉన్న తెలుగుభాగవతం లాప్-టాప్ ను చూసి. . సభకు తెలుగుభాగవతం.ఆర్గ్ ను ఆప్యాయంగా పరిచయం చేసారు. పోతన, మహాభాగవతం విచ్చేశాయి; పోతన, నారయ, సింగయ, గంగనార్యలు విచ్చేసారు సభను పావనం చేసారు అని ఉద్ఘాటించారు. . తెలుగు ఆచార్యులు, పండితులు, తెలుగు విద్యార్థుల మధ్య . . . చాలా సంతోషం అయింది. ఇలా మా మురళీధర రావు, మాడభూషి గార్లను దర్శించే అదృష్టం కలిగింది. ఇది మా నల్లనయ్య అనుగ్రహంగా గ్రహించాను.
http://telugubhagavatam.org/


No comments: