Sunday, April 12, 2015

కృష్ణలీలలు

10.1-351-కంద పద్యము
ప్రబ్బిన భక్తిని హరిపైఁ
బ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ
బ్బుదు రఁట హరిపోషణ
బ్బిన తలిదండ్రు లెచటి బ్బుదురొ? తుదిన్.
         కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరతారో?
         అని పరీక్షిన్మహారాజు యశోదకు నోటిలో విశ్వరూపం చూపిన బాలకృష్ణుని లీలలు చెప్పగా విని, ఇలా అడుగుతున్నాడు.
10.1-351-kaMda padyamu
prabbina bhaktini haripaiM~
gabbaMbulu cheppi kavulu kaivalyashree
kabbudu raM~Ta haripOShaNa
mabbina talidaMDru lechaTi kabbuduro? tudin.
         ప్రబ్బిన = అతిశయించిన; భక్తిని = భక్తితో; హరి = విష్ణుమూర్తి; పైన్ = మీద; కబ్బంబులున్ = కావ్యములు, కవిత్వము; చెప్పి = రచియించి; కవులున్ = పండితులు; కైవల్యశ్రీ = మోక్షసంపద; కిన్ = కున్; అబ్బుదురు = చెందుదురు; అట = అంటారు; హరి = శ్రీహరి యొక్క; పోషణమున్ = పెంచుట; అబ్బిన = లభించిన; తలిదండ్రులు = తల్లిదండ్రులు; ఎచటి = ఎంతగొప్పపదమున; కిన్ = కు; అబ్బుదురొ = పొందెదరు; తుదిన్ = చివరకు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: