Saturday, April 18, 2015

కృష్ణలీలలు

10.1-360-వచనము
అంత నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబు లయిన దధికుంభ శకలంబులఁ బొడఁగని తుంటకొడుకు వెన్నదింట యెఱింగి నగుచు నా కలభగామిని యతనిం గానక చనిచని.
          యశోదాదేవి పొయ్యిమీది పాలు దించి వచ్చింది. పగిలిపోయిన పెరుగుకుండ ముక్కలను చూసింది. తుంటరి కొడుకు వెన్న మీగడలు తిన్నాడని గ్రహించి నవ్వుకుంటూ చూస్తే, కొంటె కృష్ణుడు కనిపించలేదు. అతణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది యశోద.          
10.1-360-vachanamu
aMta naa lOlalOchana paalu DiMchi vachchi vikalaMbu layina dadhikuMbha shakalaMbulaM~ boDaM~gani tuMTakoDuku vennadiMTa yeRriMgi naguchu naa kalabhagaamini yataniM gaanaka chanichani.
          అంతన్ = అప్పుడు; = ; లోలలోచన = సుందరి, యశోద {లోలలోచన - చలించెడి కన్నులుకలామె, స్త్రీ}; పాలున్ = పాలను; డించి = పొయ్యిమీంచిదించి; వచ్చి = వెనుకకు వచ్చి; వికలంబులు = పగిలిపోయిన; దధికుంభ = పెరుగుకుండ; శకలంబులన్ = పెంకులను; పొడగని = చూసి; తుంట = తుంటరి; కొడుకు = కుమారుడు; వెన్నన్ = వెన్నని; తింటన్ = తినుట; ఎఱింగి = తెలిసికొని; నగుచున్ = నవ్వుతూ; = ; కలభగామిని = సుందరి {కలభగామిని - కలభ (ఏనుగుగున్న వంటి) నడక కలామె, స్త్రీ}; అతనిన్ = అతనిని; కానకన్ = కనుగొనలేక; చనిచని = బాగాతిరిగి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: