Saturday, April 25, 2015

కృష్ణలీలలు

10.1-372-సీస పద్యము
స్తంభాదికంబులు నకు నడ్డం బైన; నిట్టట్టు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ; నే నని మునుముట్ట నేడ్చువాని
గాటుక నెఱయంగఁ న్నులు నులుముచు; వెడలు కన్నీటితో వెగచువాని
నే దెసవచ్చునో యిది యని పలుమాఱు; సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ
10.1-372.1-ఆటవెలది
గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు
లిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి
రుణతోడ బాలుఁ ట్టఁ దలఁచి.
10.1-373-వచనము
ఇట్లనియె.
         కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్జంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కళ్ళ కాటుక చెదిరేలా నులుముకుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంటచూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది; అతనితో ఇలా అంది.
10.1-372-seesa padyamu
staMbhaadikaMbulu danaku naDDaM baina; niTTaTTu chani paTTaneenivaani
nee tappu sairiMpu miMka doMgilaM~ bOva; nE nani munumuTTa nEDchuvaani
gaaTuka neRrayaMgaM~ gannulu nulumuchu; veDalu kanneeTitO vegachuvaani
nE desavachchunO yidi yani palumaaRru; suruguchuM~ grEgaMTaM~ joochuvaaniM~
10.1-372.1-aaTaveladi
gooDaM~ baaRri paTTukoni veRrapiMchuchuM~
jinna vennadoMga chikke nanuchu
naligi koTTaM~ jEtu laaDaka pooM~bOM~Di
karuNatODa baaluM~ gaTTaM~ dalaM~chi.
10.1-373-vachanamu
iTlaniye.
          స్తంభ = స్తంభము; ఆదికంబులు = మున్నగునవి; తన = అతని; కిన్ = కి; అడ్డంబు = అడ్డము; ఐనన్ = వచ్చినచో; ఇట్టట్టు = ఇటునటు; చని = వెళ్లి; పట్టనీని = పట్టుకోనీయని; వానిన్ = వానిని; = ఈ ఒక్క; తప్పు = తప్పును; సైరింపుము = ఓర్చుకొనుము; ఇంకన్ = ఇక; దొంగిల = దొంగతనమునకు; పోవన్ = వెళ్ళను; నేను = నేను; అని = అని; మునుముట్టన్ = ముందుగానే; ఏడ్చు = ఏడ్చేసే; వానిన్ = వానిని; కాటుక = కాటుక; నెఱయంగన్ = పాకిపోయెలాగ; కన్నులున్ = కళ్ళను; నులుముచున్ = నులుముకొనుచు; వెడలు = కారుతున్న; కన్నీరు = కన్నీరు; తోన్ = తోటి; వెగచు = వెక్కివెక్కి ఏడ్చెడి; వానిన్ = వానిని; = ; దెసన్ = వైపునుండి; వచ్చునో = వచ్చెస్తుందో; ఇది = ఈమె; అని = అని; పలు = అనేక; మాఱు = సార్లు; సురుగుచున్ = భయపడుతూ; క్రేగంటన్ = ఓరకంటితో; చూచు = చూచెడి; వానిన్ = వానిని; కూడబాఱి = వెంటబడి.
          పట్టుకొని = పట్టుకొని; వెఱపించుచన్ = బెదిరించుచు; చిన్న = చిన్నవాడైన; వెన్నదొంగ = వెన్ననుదొంగిలించువాడు; చిక్కెను = దొరికెను; అనుచున్ = అంటు; అలిగి = కోపగించి; కొట్టన్ = కొట్టుటకు; చేతులు = చేతులు; ఆడక = రాక; పూబోడి = సుందరి {పూబోడి - పువ్వువలె సున్నితమైనామె, స్త్రీ}; కరుణ = దయ; తోడన్ = తోటి; బాలున్ = పిల్లవానిని; కట్టన్ = కట్టివేద్దామని; తలచి = భావించి.
          ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: