10.1-344-వచనము
అని
నిశ్చయించి.
10.1-345-ఆటవెలది
ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు
గానఁబడిన బుద్ధి కంప మయ్యె
నా మహాత్ము
విష్ణు నఖిలలోకాధారు
నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు.
ఇలా ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ
మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
విష్ణుమూర్తి అన్ని లోకాలకు ఆధారంగా
నిలబడినవాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాత్ముడైన విష్ణువు వల్లనే నాకు
ఈ విశ్వరూపం కనబడింది. నా బుద్ధి చలించిపోయింది. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ మహా
విష్ణువునే శరణు కోరుతాను.
10.1-344-vachanamu
ani nishchayiMchi.
10.1-345-aaTaveladi
E mahaatmuvalana nee vishvaroopaMbu
gaanaM~baDina buddhi kaMpa mayye
naa mahaatmu viShNu nakhilalOkaadhaaru
naartulellaM~ baaya naashrayiMtu.
అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని.
ఏ = ఏ; మహాత్మున్ = గొప్పవాని; వలనన్ = వలన; ఈ = ఈ; విశ్వ = భువనభాండము యొక్క;
రూపంబున్ = స్వరూపము; కానబడినన్ = కనబడుటచేత; బుద్ధి = మనసు; కంపము = చలించినది; అయ్యెన్ = అయినది; ఆ = అట్టి; మహాత్మున్ = గొప్పవానిని; విష్ణున్ = నారాయణుని; అఖిల = సమస్తమైన; లోక = భువనములకు; ఆధారున్ = ఆధారభూతుని; ఆర్తులు = పీడలు,
దుఃఖములు; ఎల్లన్ = అన్నిటిని; పాయన్ = తొలగించుకొనుటకు; ఆశ్రయింతు = కొలచెదను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment