Monday, April 13, 2015

కృష్ణలీలలు

10.1-354-వచనము
అంతనొక్కనాఁడు తనయింటికడ పాపలందఱు నయ్యైపనులందుఁ బంపుపడిపోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబు కడఁ గుదురుగా నొక్క దధికుంభంబు పెట్టి మిసిమిగల మీఁగడపెరుగు కూడంబోసి వీఁక నాఁక త్రాడు కవ్వంబున నలంవరించి.
          ఒక రోజు యశేదాదేవి ఇంటివద్ద ఉన్న యువతులు అందరూ వారి పనులమీద వెళ్ళిపోయారు. యశోద పెరుగు చిలకడానికి స్తంభం వద్ద కుదురు మీద పెరుగు కుండను పెట్టింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలెట్టింది.
10.1-354-vachanamu
aMtanokkanaaM~Du tanayiMTikaDa paapalaMdaRru nayyaipanulaMduM~ baMpupaDipOyina naMdasuMdari saMraMbhaMbunaM darikaMbaMbu kaDaM~ gudurugaa nokka dadhikuMbhaMbu peTTi misimigala meeM~gaDaperugu kooDaMbOsi veeM~ka naaM~ka traaDu kavvaMbuna nalaMvariMchi.
          అంతన్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = రోజు; తన = తన యొక్క; ఇంటి = నివాసము; కడన్ = వద్ద; పాపలు = సేవకురాళ్ళు; అందఱున్ = అందరు; అయ్యై = వేరువేరు; పనులు = పనులు; అందున్ = లో; పడిపోయినన్ = మునిగిపోగా; నంద = నందుని యొక్క; సుందరి = భార్య; సంరంభంబునన్ = వేగిరపాటుతో; తరి = చిలుకుటకైన; కంబంబున్ = స్తంభము; కడన్ = వద్ద; కుదురుగాన్ = కదలకుండా {కుదురు - కుండ కదలకుండ కుండకింద పెట్టెడి గుండ్రని చుట్ట}; ఒక్క = ఒకానొక; దధి = పెరుగు; కుంభంబు = కుండను; పెట్టి = ఉంచి; మిసిమి = వెన్న; కల = ఉన్నట్టి; మీగడ = తొరకకట్టిన; పెరుగున్ = పెరుగులను; కూడన్ = కలియ; పోసి = పోసి; వీకన్ = పూనికతో; నాకత్రాడు = కవ్వపుతాడు; కవ్వంబునన్ = కవ్వమునకు; అలంవరించి = చక్కగాచుట్టి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: