10.1-356-వచనము
ఆ సమయంబున.
10.1-357-కంద పద్యము
సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు
సడి గొట్టుచు నమ్మ రమ్ము; చన్నిమ్మనుచున్
వెడవెడ గంతులు వైచుచుఁ
గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్.
యశోద
పెరుగు చిలుకుతూ ఉంది.
కృష్ణబాలకుడు
ఆమె చుట్టూ తిరుగుతూ, మీద పడుతూ, పైటలాగతూ అల్లరి చేయసాగాడు. “అమ్మా! రావే! నాకు పాలియ్యవే!” అంటూ గంతులు
వేస్తూ దగ్గరకొచ్చి, చిన్నారి కన్నయ్య కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు.
10.1-357-kaMda padyamu
suDiyuchu vraaluchuM~ gidukuchu
saDi goTTuchu namma rammu; channimmanuchun
veDaveDa gaMtulu vaichuchuM~
gaDavaM~ gadisi baalakuMDu gavvamuM~ baTTen.
ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
సుడియుచున్ = గుండ్రంగా తిరుగుతూ; వ్రాలుచున్ = వాలిపోతూ; కిదుకుచున్ = గారాలుపోతూ; చడిగొట్టుచన్ = గోలచేస్తూ; అమ్మ = తల్లి; రమ్ము = రా; చన్ను = చనుబాలు; ఇమ్ము = ఇయ్యి; అనుచున్ = అంటూ; వెడవెడ = పిల్లిగంతులు; వైచుచున్ = వేస్తూ; కడవన్ = పెరుగుకుండను; కదిసి = చేరి; బాలకుండు = పిల్లవాడు; కవ్వమున్ = కవ్వమును; పట్టెన్ = పట్టుకొన్నాడు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment