10.1-368-కంద పద్యము
గజ్జలు గల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!
10.1-369-వచనము
అప్పుడు.
తన
ఆగడాలు చూసి కొట్టడానికి వస్తున్న తల్లి యశోదకు దొరకకుండా రోలు మీదనుంచి దూకేసి. .
.
చిలిపి
కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి
గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ
వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు.
అప్పుడు. . .
10.1-368-kaMda padyamu
gajjalu gallani mrOyaM~ga
najjalu drokkuTalu maani yatijavamuna yO
Shijjanamulu nagaM~ dalliyuM~
bajjaM janudEra nataM~Du paruviDe nadhipaa!
10.1-369-vachanamu
appuDu.
గజ్జలు = కాలిగజ్జలు; గల్లు = గల్లుగల్లు; అని = అని; మ్రోయగన్ = మోగుతుండగా; అజ్జలు = చిందులు; త్రొక్కుటలు = వేయుట; మాని = వదిలేసి; అతి = మిక్కిలి; జవమునన్ = వేగముగా; యోషిజ్జనములు = ఆడవాళ్ళు; నగన్ = నవ్వుతుండగ; తల్లియున్ = తల్లి; పజ్జన్ = కూడా; చనుదేరన్ = వస్తుండగా; అతడు = అతను; పరువిడెన్ = పరుగెట్టెను; అధిపా = రాజా.
అప్పుడు = ఆ సమయమందు
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment