ప్రళయం రాకుండా లోకాన్నిరక్షించుకోండి,
పర్యావరణాన్ని రక్షించుకోండి అని పురాణలు కూడ ఘోషిస్తున్నాయి. మన పోతనగారు
ఆంధ్రమహాభాగవతంలో చతుర్థ స్కంధంలో ప్రచేతసుల వృత్తాంతంలో వృక్షాలను నాశనం
చేయవద్దని బ్రహ్మదేవు డంతటి వాడిచేత చెప్పించి పర్యావరణ ఆవశ్యకతను ఒత్తి చెప్పాడు.
(పద్యాలు 4-684 నుండి
4-943). చూడండి ఈ ప్రచేతసుల కథ
ప్రాచీన బర్హి మహారాజుకి ప్రచేతసులు అని
పదిమంది కొడుకులుట (చేతస్సు అంటే మది / ప్రాణము, ప్ర అంటే మిక్కిలి). వారికి విడి
విడిగా పేర్లు లేవుట. వారు అందరు అంతా కలిసి కట్టుగా ఉంటారట. వారిని తండ్రి (కారణ భూతుడు) వంశాభివృద్ధికై తపస్సు
చేయమని ఆఙ్ఞాపించాడు. వారు సముద్రంలో తపస్సు చేస్తున్నారు (జీవులు సముద్రంలోనే
మొదట పుట్టాయిట!). భగవంతు (ప్రభువు) డగు హరి ఆజ్ఞమేర తపస్సు ఆపి బైటకొచ్చారు.
వృక్షాలు అడ్డంగా ఉన్నాయని ఆగ్రహించారుట. భూమిపై చెట్లు విపరీతంగా పెరిగిపోయాయని కోపం
తెచ్చుకొని చెట్లని తమ తపోగ్నితో కాల్చివేస్తున్నారుట. బ్రహ్మదేవుడు (సృష్టి కర్త)
వారిని అనునయించి, విడమర్చి చెప్పి, ఆ ప్రళయాన్ని ఆపించాడు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం
వృక్షాలు తమ పెంపుడు కూతురు మారిషను ఇచ్చాయి. ఆమెను వారందరు కలిసి పెళ్ళాడారు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment