10.1-374-కంద పద్యము
వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోరత్వం బించుకయును
నేర రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?
ఓహో ఎపరండీ
వీరు? శ్రీకృష్ణులవారేనా?
అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే చూడలేదట కదా!
దొంగతనమంటే ఏమిటో పాపం తెలియదట కదా! ఈ
లోకంలో ఇంతటి బుద్ధిమంతులు లేనేలేరట!
పట్టుబడ్డ వెన్నదొంగను కొట్టటానికి చేతులురాని
తల్లి యశోదాదేవి కొడుకును ఇలా దెప్పుతోంది.
10.1-374-kaMda padyamu
veerevvaru? shreekRiShNulu
gaaraa? yennaDunu vennaM~ gaanaraM~Ta kadaa!
chOratvaM biMchukayunu
nEra raM~Ta! dharitri niTTi niyatulu galarE?
వీరు = ఈ పెద్దమనిషి; ఎవ్వరు = ఎవరు; శ్రీకృష్ణులు = కృష్ణడుగారు; కారా = కాదా; ఎన్నడును = ఎప్పుడు; వెన్నన్ = వెన్నను; కానరు = చూడనే చూడలేదు; అట = అట; కదా = కాదా; చోరత్వంబున్ = దొంగతనము; ఇంచుకయును = కుంచము కూడా; నేరరు = తెలియదు; అట = అట; ధరిత్రిన్ప = భూమిపైన; ఇట్టి = ఇలాంటి; నియతులు = పద్దతి ప్రకార ముండువారు; కలరే = ఉన్నారా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment