10.1-347-వచనము
అని
తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోద యందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన.
10.1-348-కంద పద్యము
జడనుపడి యెఱుక చెడి యా
పడతుక సర్వాత్ముఁ డనుచుఁ బలుకక యతనిం
గొడుకని తొడపై నిడుకొని
కడు
వేడుకతోడ మమతఁ గావించె నృపా!
బాలకృష్ణుడు ఇలా తనను
భగవంతుడైన శ్రీమహావిష్ణువుగా భావిస్తూ ఉన్న యశోదకు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు
పరీక్షిన్మహారాజా! ఆ మాయా ప్రభావంవలన యశోద మోహం చెంది, బాలకృష్ణుడు సర్వాత్ముడే
అనే విషయం మరచిపోయింది. అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దులాడింది
10.1-347-vachanamu
ani tannu paramEshvaruMDani talaMchuchunna yashOda yaMdu naa
kRiShNuMDu vaiShNavamaayaM boMdiMchina.
10.1-348-kaMda
padyamu
jaDanupaDi yeRruka cheDi yaa
paDatuka sarvaatmuM~ DanuchuM~ balukaka yataniM
goDukani toDapai niDukoni
kaDu vEDukatODa mamataM~ gaaviMche nRipaa!
అని = అని; తన్ను = అతనిని; పరమేశ్వరుండు = భగవంతుడు; అని = అని; తలంచుచున్ = ఎంచుచున్నట్టి; యశోదన్ = యశోద; అందున్ = ఎడల; ఆ = ఆ; కృష్ణుండు = కృష్ణుడు; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క;
మాయన్ = మహిమను; పొందించినన్ = కలిగించగా.
జడనుపడి = మూఢత్వములోపడిపోయి; ఎఱుక = ఙ్ఞానము; చెడి = పోయి; ఆ = ఆ; పడతుక = పడతి; సర్వాత్ముడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; పలుకక = అనకుండా; అతనిన్ = అతనిని; కొడుకు = పుత్రుడు; అని = అని; తొడ = ఒడి; పైన్ = మీద; ఇడుకొని = పెట్టుకొని; కడు = మిక్కలి; వేడుక = కుతూహలము; తోడన్ = తోటి; మమతన్ = ప్రీతి; కావించెన్ = చేసెను; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment