Thursday, April 30, 2015

కృష్ణలీలలు

10.1-379-కంద పద్యము
లన గట్టె ఱోలన్
లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియవా
గ్జాలుం బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్.
            ఇలా యశోద అవతార రహస్యాలు ఎత్తుకుంటూ దొంగకృష్ణుని ఎత్తిపొడిచి, అతనిని రోలు ఒకదానికి కట్టేసింది.  ఆ దుడుకు పిల్లాడు వెన్నదొంగిలించటమనే క్రీడ కలవాడు, సంతోషాలు పంచుతూ గలగలా మాట్లాడు వాడు. తల్లి తనను కట్టిసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు కనబడుతున్న గొల్లపిల్లాడు. ముత్తెపుబొట్టు నుదుట అలంకారంగా మెరుస్తున్న వాడు.
10.1-379-kaMda padyamu
aa lalana gaTTe RrOlan
leelan navaneetachauryaleeluM briyavaa
gjaaluM barivismita gO
paalun muktaalalaama phaalun baalun.
          = ; లలన = ఇంతి; కట్టెన్ = కట్టివేసెను; ఱోలన్ = రోటికి; లీలన్ = అవలీలగా; నవనీతచౌర్యలీలున్ = వెన్నదొంగను; ప్రియ = ఇంపైన; వాక్ = మాటల; జాలున్ = అనేకముపలుకువానిని; పరి = మిక్కిలిగా; విస్మిత = ఆశ్చర్యపోతున్న; గోపాలున్ = యాదవులు కలవానిని; ముక్తా = ముత్యాల; లలామ = ఆభరణము; ఫాలున్ = నుదుటకలవానిని; బాలున్ = బాలకృష్ణుని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Wednesday, April 29, 2015

కృష్ణలీలలు

10.1-377-సీస పద్యము
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు; లఁచెదు గట్టైనఁ రల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె; దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
న్యుల నల్పంబు డుగంగఁ బాఱెదు; రాచవేఁటలఁ జాల వ్వఁదెచ్చె;
లయవు నీళ్ళకు డ్డంబు గట్టెదు; ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
10.1-377.1-ఆటవెలది
దంబరంబు మొలకు డుగవు తిరిగెద
వింకఁ గలికి చేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్చ నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.
10.1-378-వచనము
అని మర్మంబు లెత్తి పలికి.
            రే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరప్రవతాన్నే ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రోజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకర్ర పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా).
          ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.         
          చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు.  ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి.  
10.1-377-seesa padyamu
tOyaMbu livi yani tolagaka chochchedu; talaM~chedu gaTTainaM~ darala netta;
maMTitO naaTalu maanavu; kOraaDe; dunnata staMbhaMbu looM~paM~ bOye;
danyula nalpaMbu laDugaMgaM~ baaRredu; raachavEM~TalaM~ jaala RravvaM~dechche;
dalayavu neeLLaku naDDaMbu gaTTedu; musalivai halivRitti monayaM~; jooche
10.1-377.1-aaTaveladi
daMbaraMbu molaku naDugavu tirigeda
viMkaM~ galiki chEM~ta lEla putra!
ninnu vaMpa vraalcha nE nEra naniyo nee
viTTu kriMdu meeM~du neRruM~ga kuniki.
10.1-378-vachanamu
ani marmaMbu letti paliki.
          తోయంబులు = నీళ్ళు; ఇవి = ఇవి; అని = అని; తొలగక = తప్పుకొనక; చొచ్చెదు = ప్రవేశించెదు (మత్యావతార సూచన); తలచెదు = ప్రయత్నించెదవు; గట్టైనన్ = కొండనైన; తరలనెత్తన్ = లేవనెత్తుటకు (కూర్మావతార సూచన); మంటితోన్ = మట్టితో; ఆటలు = ఆటలాడుట; మానవు = వదలవు; కోరాడెదు = గుచ్చియెత్తదవు (వరాహావతార సూచన); ఉన్నత = ఎత్తైన; స్తంభంబులున్ = స్తంభములను; ఊపబోయెదు = ఊపుటకుపోయెదవు (నరసింహావతార సూచన); అన్యులన్ = పరులను; అల్పంబులు = చిన్నవి; అడుగన్ = అర్థించుటకు; పాఱెదు = వెళ్ళెదవు (వామనావతార సూచన); రాచ = పెద్ద (రాజులను); వేటలన్ = పేటలందు (వేటాడుటందు); చాలన్ = మిక్కిలి; ఱవ్వ = అపకీర్తి (గొడవలు); తెచ్చెదు = తీసుకొచ్చెదవు (పరశురామావతార సూచన); అలయవు = అలసటన్నది లేదు; నీళ్ళు = జలముల; కున్ = కు; అడ్డంబున్ = కట్టను; కట్టెదు = కట్టుదువు (రామావతార చూచన); ముసలివి = వయసుమీరినవాడవు (ముసలము ధరించినవాడవు); = అయ్యి; హలి = రైతువలె (ఙలధారివి); వృత్తిన్ = వలె; మొనయజూచెదు = ప్రవేశింపచూచెదవు (బలరామావతార సూచన); అంబరంబున్ = బట్టలు.
          మొలకున్ = మొలకికట్టుకొనుటకు; అడుగవు = కోరవు (బౌద్ధావతార సూచన); తిరిగెదవు = నడచెదవు; ఇంకన్ = మళ్ళీ; కలికి = జగడపు; చేతలు = పనులు; ఏలన్ = ఎందుకు (కల్క్యవతార సూచన); పుత్ర = కొడుకా; నిన్నున్ = నిన్ను; వంపన్ = వంచుటకు; వ్రాల్చన్ = అణచుటకు; నేన్ = నేను; నేరను = అసమర్థురాలను; అనియొ = అనా; నీవు = నీవు; ఇట్టు = ఇలా; కిందుమీదున్ = కిందమీద; ఎఱుగకున్ = తెలియకవర్తించుట (అలక్ష్యమున); కిన్ = కుకారణము.
          అని = అని; మర్మంబులు = ఎత్తిపొడుపు మాటలు, పెడసరి మాటలు; ఎత్తి = ఎత్తిపొడిచి; పలికి = అని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Tuesday, April 28, 2015

కృష్ణలీలలు

10.1-376-కంద పద్యము
క్కడనైనను దిరిగెద;
వొక్క యెడన్ గుణము గలిగి యుండవు; నియమం
బెక్కడిది నీకు? మఱచినఁ
క్కగఁ బోయెదవు పెక్కు జాడలఁబుత్రా!
            కన్నా! ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. ఒకచోట కుదురుగా, బుద్ధి కలిగి ఉండవు కదా. నీకు పద్దతి ప్రకారం ఉండటం అంటూ లేదా ఏమిటి? ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు ఎన్నివేషాలైనా వెసి, ఎక్కడికైనా పోతావురా కొడుకా!.
            ఇలా యశోదాదేవి తన కొడుకు కృష్ణుని దెబ్బలాడుతూంటే కూడా తత్వమే కనబడుతోందిట. భగవంతుడవు సర్వాంతర్యామివి, ఎక్కడైనా తిరుతావు. గుణాతీతుడవు, నీవు బుద్ధికలిగి కూర్చోడం ఏమిటి? సర్వోన్నతుడవు నియమాలు ఎవరు పెట్టగలరు? ఈ ఎరుక మరచి ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు. మిత్రులు, శత్రులు మొదలైన అనేకంగా కనిపిస్తావు కదయ్యా!”   . . . అవును ఆత్మావైపుత్రా అంటారు పెద్దలు.
10.1-376-kaMda padyamu
ekkaDanainanu dirigeda;
vokka yeDan guNamu galigi yuMDavu; niyamaM
bekkaDidi neeku? maRrachinaM~
jakkagaM~ bOyedavu pekku jaaDalaM~butraa!
          ఎక్కడన్ = ఎక్కడను; ఐనన్ = అయినను; తిరిగెదవు = సంచరించెదవు; ఒక్క = ఏదోఒక; యెడన్ = చోట; గుణము = బుద్ధి; కలిగి = కలిగి; ఉండవు = ఉండవు; నియమంబు = కట్టుబాటు; ఎక్కడిది = అసలులేదు; నీకున్ = నీకు; మఱచినన్ = ఆదమరచినచో; చక్కగన్ = చక్కగా; పోయెదవు = వెళ్ళిపోయెదవు; పెక్కు = అనేకమైన; జాడలన్ = దార్లమ్మట; పుత్రా = కొడుకా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Monday, April 27, 2015

కృష్ణలీలలు

10.1-375-కంద పద్యము
ట్టినఁ బట్టుపడని నినుఁ
ట్టెద నని చలముఁగొనినఁ ట్టుట బెట్టే?
ట్టువడ వండ్రు పట్టీ
ట్టుకొనన్ నాఁకుఁగాక రులకు వశమే?
         పట్టుకుందామంటే ఎవరికీ చిక్కనని అనుకుంటున్నావా. పట్టుకోవాలని నేను పట్టుబడితే నువ్వు దొరకటం  పెద్ద కష్టం అనుకుంటున్నావా. నువ్వు చిక్కవు అని అందరూ అంటారు. నిన్ను పట్టుకోడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదురా.
         అసలు తత్వం కూడా ఆ మహాతల్లి యశోదమ్మ నోట అంతరార్థంగా ఇలా బయటబడుతోంది.
10.1-375-kaMda padyamu
paTTinaM~ baTTupaDani ninuM~
baTTeda nani chalamuM~goninaM~ paTTuTa beTTE?
paTTuvaDa vaMDru paTTee
paTTukonan naaM~kuM~gaaka parulaku vashamE?
          పట్టినన్ = పట్టుకొన్నను; పట్టుబడని = చిక్కని; నినున్ = నిన్ను; పట్టెదన్ = పట్టుకుంటాను; అని = అని; చలము = పట్టుదల; కొనిన = పట్టినచో; పట్టుట = పట్టుకొనుట; బెట్టే = ఏమైనా ఘనకార్యమా; పట్టువడవు = చిక్కవు; అండ్రున్ = అనెదరు; పట్టీ = కొడుకా; పట్టుకొనన్ = పట్టుకొనుటకు; నా = నా; కున్ = కు; కాక = తప్పించి; పరులు = ఇతరుల; కున్ = కు; వశమే = శక్యమే.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :