జగదవనవిహారీ
9-735-మా.
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ!
లోకరక్షణకై విహరించువాడ! శత్రువు లందరిని దండించువాడ! సుగుణములనే వనముల యందు విహరించువాడ! అందగత్తెల అభిమానం చూరగొనెడివాడ! పుణ్యాత్ములను పోషించువాడ! వీరత్వం చూపు టందు ఆసక్తి కలవాడ! స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం
కలిగించువాడ! ఎల్లప్పుడు
సత్యమునే పలుకువాడ! శ్రీరామ! నీకు నమస్కారములు.
నవమస్కంధాంత ప్రార్థన
9-735-maa.
jagadavanavihaaree!
SatrulOkaprahaaree!
suguNavanavihaaree!
suMdareemaanahaaree!
vigatakalushapOshee!
veeravidyaabhilaashee!
svaguruhRdayatOshee!
sarvadaa satyabhaashee!
జగ దవన విహారీ = శ్రీరామా {జగ దవన విహారుడు - లోకముల రక్షణకై సంచరించెడివాడు. రాముడు};
శత్రులోక ప్రహారీ = శ్రీరామా {శత్రులోక ప్రహారుడు - శత్రువులందరిని దండించెడివాడు, రాముడు}; సుగుణ వన విహారీ = శ్రీరామా {సుగుణ వన విహారుడు -
సుగుణములనెడి వనమునందు విహరించువాడు, రాముడు}; సుందరీ మాన హారీ = శ్రీరామా {సుందరీ మాన హారుడు - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు}; విగత కలుష పోషీ = శ్రీరామా {విగతకలుష పోషుడు -
విగతకలుష (పుణ్యాత్ములను) పోషించువాడు, రాముడు}; వీర విద్యాభిలాషీ = శ్రీరామా {వీర విద్యాభిలాషుడు - వీరత్వము చూపు టందు ఆసక్తి కలవాడు, రాముడు}; స్వ గురు హృదయ తోషీ = శ్రీరామా {స్వ గురు హృదయ తోషుడు -
తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు}; సర్వదా సత్య భాషీ = శ్రీరామా {సర్వదా సత్య భాషి - ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment