భాందవముననైన
10.1-974-ఆ.
భాంధవమున నైనఁ బగనైన వగనైనఁ
బ్రీతినైనఁ బ్రాణభీతినైన
భక్తినైన హరికిఁ బరతంత్రులై యుండు
జనులు మోక్షమునకుఁ జనుదు రధిప!
ఓ పరీక్షిన్మహారాజా! చుట్టరికంతో నైనా,
విరోధంతో నైనా, చింతతో నైనా, ప్రేమతో నైనా, ప్రాణభయంతో నైనా, భక్తితో నైనా ఏ లాగున
నైనా సరే శ్రీహరి ధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.
కృష్ణుని విషయాసక్తు లైన గోపికలు
తమ ప్రియునిగానే భావించారు కాని పరబ్రహ్మగా కాదు కదా. మరి వారు సత్వాది గుణమయా లైన
దేహాలు ఎలా వదలగలిగారు అని సందేహం వెలిబుచ్చిన పరీక్షిత్తునకు శుకబ్రహ్మ భాగవత
తత్వం వివరిస్తున్నాడు
10.1-974-aa
bhaaMdhavamuna
naina@M baganaina vaganaina@M
breetinaina@M
braaNabheetinaina
bhaktinaina
hariki@M barataMtrulai yuMDu
janulu
mOkshamunaku@M janudu radhipa!
భాంధవమున = బంధుత్వముచేత; ఐనన్ = అయినను; పగన = శత్రుత్వముచేత; ఐనన్ = అయినను; వగన్ = చింతచేత; ఐనన్ = అయినను; ప్రీతిన్ = ప్రేమచేతను; ఐనన్ = అయినను; ప్రాణభీతి = అతిమిక్కిలి భయముచేత; ఐనన్ = అయినను; భక్తి = భక్తిచేతను; ఐనన్ = అయినను; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పరతంత్రులు = లగ్నమైనవారు; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; జనులు = వారు; మోక్షము = ముక్తి; కున్ = కు; చనుదురు = వెళ్ళెదరు; అధిప = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment