Thursday, July 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 340

అలసితివిగదన్న


10.1-259-ఆ.
లసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
న్నుఁగుడువు మన్న! సంతపడు మన్న!
నుచుఁ జన్నుఁగుడిపె ర్భకునకు.
                ఓ నా చిన్ని కన్నా! అలసిపోయావా నాయనా! ఆకలేస్తోందా కన్నా! మంచి వాడివి కదా కన్నా! ఏడుపు ఇక ఆపు నాయనా! దా పాలు తాగి చిరునవ్వులు చిందించు కన్నా! అంటు లాలిస్తు యశోదాదేవి పాలిచ్చింది బిడ్డడికి.
చంటి పిల్లాడుగా ఉన్న కృష్ణుని పక్కమీద నిద్రపుచ్చి యశోద పనులలో ఉంది. ఇంతలో నిద్రలేచిన ఆ మాయా శిశువు ఏడుపు లంకించుకొని శకటాసురుని ఓ తన్ను తన్ని శిక్షించాడు. అందరు ఆశ్చర్యపోతుంటే. ఏడుపు విన్న యశోద వచ్చి ఇలా లాలిస్తు పాలిచ్చింది. న్నతో వృత్యనుప్రాస అలకరించబడింది యీ పద్యంలో. ఒకే హల్లు పలుమారులు వస్తే వృత్యనుప్రాసాలంకారం.
10.1-259-aa.
alasitivi gadanna! yaakoMTivi gadanna!
maMchi yanna! yaeDpu maanu manna!
channu@MguDuvu manna! saMtasapaDu manna!
yanuchu@M jannu@MguDipe narbhakunaku.
          అలసితివి = అలసిపోయావు; కద = కదా; అన్న = నాయనా; ఆకొంటివి = ఆకలివేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచి = బుద్ధిమంతుడివి; అన్న = నాయనా; ఏడ్పున్ = రోదనమును; మానుము = మానివేయుము; అన్న = నాయనా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుము = సంతోషింపుము; అన్న = నాయనా; అనుచున్ = అంటూ; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించెను; అర్భకున్ = పిల్లవాని; కున్ = కి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: