శరధిమదవిరామ
10.2-1342-మా.
శరధిమదవిరామా! సర్వలోకాభిరామా!
సురరిపువిషభీమా! సుందరీలోకకామా!
ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
సముద్రుని గర్వాన్ని అణచిన
వాడ! లోకాలకు సర్వానికి సుందర మైన వాడ! రాక్షసుల యెడ పరమ భయంకరమైన వాడ! సుందర స్త్రీజనాలకు మన్మథుని వంటి వాడ! రాజు లందరిలో శ్రేష్ఠమైన వాడ! తాపసులచే స్తుతింపబడు
వాడ! సర్వ సుణాలకు అలవాలమైన వాడ! సూర్యవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడ! ఓ శ్రీరామచంద్రప్రభు!
దశమస్కంధ ద్వితీయాశ్వాసాంత
ప్రార్థన యిది.
10.2-1342-maa.
Saradhimadaviraamaa!
sarvalOkaabhiraamaa!
suraripuvishabheemaa!
suMdareelOkakaamaa!
dharaNivaralalaamaa!
taapasastOtraseemaa!
surachiraguNadhaamaa!
sooryavaMSaabdhisOmaa!
శరధిమదవిరామా = శ్రీరామా {శరధిమదవిరాముడు - శరధి (సముద్రము యొక్క) మద
(గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు}; సర్వలోకాభిరామా = శ్రీరామా {సర్వలోకాభిరాముడు - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోఙ్ఞుడు), శ్రీరాముడు}; సురరిపువిషభీమా = శ్రీరామా {సురరిపువిషభీముడు - సురరిపు
(రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు}; సుందరీలోకకామా = శ్రీరామా {సుందరీలోకకాముడు - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు}; ధరణివరలలామా = శ్రీరామా {ధరణివరలలాముడు - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు}; తాపసస్తోత్రసీమా = శ్రీరామా {తాపసస్తోత్రసీముడు - ఋషుల
స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు}; సురచిరగుణధామా = శ్రీరామా {సురచిరగుణధాముడు - సు (మిక్కలి) రుచిర (మనోజ్ఞమైన)
గుణ (సుగుణములకు) ధాముడు (నికిపట్టైన వాడు), శ్రీరాముడు}; సూర్యవంశాబ్ధిసోమా = శ్రీరామా {సూర్యవంశాబ్ధిసోముడు - సూర్యవంశము
అను అబ్ది (సముద్రమునకు)
సోముడు (చంద్రుడు), శ్రీరాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment