Wednesday, July 23, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 360

బలవత్సైన్యముతోడ

11-3-మ.
వత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
నన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
          బహుబలిష్ఠమైన సైన్యం, గొప్ప భుజబలం కలవాడై శ్రీకృష్ణుడు యుద్ధాలలో రాక్షస వీరులను వేగంగా ఖండించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండుటచేత, ద్యూతక్రీడ అనే మిషతో భూలోక మంతా అదిరిపోయేలా కౌరవ పాండవ యుద్ధం జరిపించి ఉభయ పక్ష సైన్యాలను హతమార్చాడు.
శుకమహర్షి జన్మకర్మవ్యాధివిమోచనంకోసం శ్రీమన్నారాయణచరితామృతం విన మని చెప్పి పరీక్షిత్తునకు భాగవతం యిలా చెప్పటం కొనసాగించాడు.
11-3-ma.
balavatseinyamutODa@M gRshNu@MDu mahaabaahaa balOpaetu@MDei
kalanan raakshasaveeravaryula vaDin khaMDiMchi, bhoobhaaramu
jjvalamei yuMDa@Mga dyootakaeLi katanaM jaavaMga@M gauravya sa
dbalamuMbaaMDava sainyamunnaDa@Mche bhoobhaagaMbu gaMpiMpa@Mgan.
          బలవత్ = బలవంతమైన; సైన్యము = సేనల సమూహము; తోడన్ = తోటి; కృష్టుడు = శ్రీకృష్ణుడు; మహా = గొప్ప; బాహాబల = భుజబలము; ఉపేతుడు = కలవాడు; ఐన = అయ్యి; కలనన్ = యుద్ధరంగములో; రాక్షస = రాక్షసులైన; వీర = వీరులలో; వర్యులన్ = ఉత్తములను; వడిన్ = వేగంగా; ఖండించి = సంహరించి; భూ = భూలోకమునకు; భారమున్ = బరువుచేటు; ఉజ్జ్వలము = విజృంభించినది; = అయ్యి; ఉండగన్ = ఉండుటచేత; ద్యూత = జూద; కేళి = క్రీడ; కతనన్ = కారణంగా; చావంగన్ = మరణించునట్లుగా; కౌరవ్య = కౌరవుల యొక్క; సద్బలమున్ = సైన్యాలను; పాండవ = పాండవుల యొక్క; సైన్యమున్ = సైన్యాలను; అడచెన్ = అణచివేసెను; భూభాగంబు = భూమండలము; కంపింపగన్ = అదిరిపోయేలా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: