చూడనివారల
10.1-292-క.
చూడని వారల నెప్పుడు
జూడక లోకములు
మూఁడు చూపులఁ
దిరుగం
జూడఁగ నేర్చిన బాలక
చూడామణి జనుల
నెఱిఁగి చూడఁగ నేర్చెన్.
తనని చూడని వాళ్ళను ఎప్పుడు చూడడు.
ముల్లోకాలు అతని చూపులతోనే గిరగిర తిరుగుతుంటాయి. అట్టి నారాయణుడు శైశవాస్తలో
నున్న చిన్ని కన్నయ్యగా జనులను కన్నులెత్తి చూడసాగాడు. క్రమంగా గుర్తుపట్టడం
ప్రారంభించాడు.
10.1-292-ka.
chooDani
vaarala neppuDu
jooDaka
lOkamulu moo@MDu choopula@M dirugaM
jooDa@Mga
naerchina baalaka
chooDaamaNi
janula neRi@Mgi chooDa@Mga naerchen.
చూడని = భక్తిలేక
తనని లెక్కచేయని; వారలన్ = వారిని; ఎప్పుడును = ఏ సమయము
నందును;
చూడక = దయచూడకుండ; లోకములున్ = లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకము}; మూడున్ = మూడింటిని; చూపులన్ = తన ఆజ్ఞ ప్రకారము; తిరుగన్ = నడచునట్లుగ; చూడగన్ = చేయుట; నేర్చిన = తెలిసిన; బాలక = బాలురలో; చూడామణి = శ్రేష్ఠుడు (తలపైని మణి వలె); జనులన్ = చుట్టుపక్కల
వారిని;
ఎఱిగి = ఆనమాలుపట్టి; చూడగన్ = చూచుటను; నేర్చెన్ = నేర్చుకొనెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment