క్రోధమాత్సర్యధనుండు
3-59-తే.
క్రోధమాత్సర్యధనుండు సుయోధనుండు
మనములోన నసూయానిమగ్నుఁ డయ్యె
నట్టి ధర్మజుఁ
డున్నాడే? యనఘచరిత!
ఓ పుణ్యచరిత్రుడ!మనసు నిండా క్రోధం
మాత్సర్యం నింపుకున్న ఆ దుర్యోధనుడు ఏ మహనీయుని దేదీప్యమానమైన మయ సభను చూసి మనసులో
కల్మషం పుట్టి అసూయలో మునిగిపోయాడో, ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా?
అని విదురుడు ఉద్ధవుని అందరి క్షేమ
సమాచారాలు అడుగుతున్నాడు.
3-59-tae.
krOdhamaatsaryadhanuMDu
suyOdhanuMDu
voluchu
nevvanisabha@M joochi kalusha modavi
manamulOna
nasooyaanimagnu@M Dayye
naTTi
dharmaju@M DunnaaDae? yanaghacharita!
క్రోధ = క్రోధము; మాత్సర్య = మాత్సర్యము; ధనుండు = ధనముగా కలవాడు; సుయోధనుడు = దుర్యోధనుడు; ఒలుచున్ = ఒప్పుచున్న; ఎవ్వని = ఎవని; సభన్ = సభాభవనమును (మయసభ); చూచి = చూసి; కలుషము = క్రోధము; పొదవి = పొంది; మనసు = మనసు; లోనన్ = లోపల; అసూయా = అసూయలో; నిమగ్నుడు = మునిగినవాడు; అయ్యెన్ = ఆయెనో; అట్టి = అటువంటి; ధర్మజుడు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ఉన్నాడే = బాగున్నాడా; అనఘ = పాపము లేని; చరిత = ప్రవర్తన కలవాడ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment