విషకుచ యగు
10.1-655-క.
విషకుచదుగ్దంబుఁ ద్రావి విషవిజయుఁడ వై
విషరుహలోచన! యద్భుత
విషయుండగు నీకు సర్ప విష మెక్కెఁ గదా!
ఓ కన్నయ్యా! విషపూరితమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ
విషాన్ని జయించిన వాడవు నువ్వు. విషము (నీటి) యందు పుట్టు పద్మాలలాంటి కన్నులు
కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్ష! అట్టి నీకు పాము విషం ఎక్కింది అంటే అంతకన్న ఆశ్చర్యం ఏముంటుంది.
10.1-655-ka.
vishakuchayuga
yagu rakkasi
vishakuchadugdaMbu@M
draavi vishavijayu@MDa vai
visharuhalOchana!
yadbhuta
vishayuMDagu
neeku sarpa visha mekke@M gadaa!
విష = విషము గల; కుచ = చన్నుల; యుగ = జంట గలామె; అగు = ఐనట్టి; రక్కసి = రాక్షసి; విష = విష పూరిత; కుచ = చను; దుగ్దంబున్ = పాలను; త్రావి = తాగి; విష = విష ప్రభావముపై; విజయుడవు = జయించిన వాడవు; ఐ = అయ్యి; విషరుహలోచన = కృష్ణా {విషరుహలోచనుడు - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; అద్భుత = ఆశ్చర్యకర
మైన;
విషయుండు = వృత్తాంతము
కలవాడవు; అగు = ఐన; నీ = నీ; కున్ = కు; సర్ప = పాము
యొక్క;
విషము = విషము; ఎక్కెను = వంటికి పట్టినది; కదా = కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment