ఆదిన్ శ్రీసతికొప్పుపై
8-592-శా.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది
కదా! మొదట
లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద,
చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి
చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా
ఉండిపోతుందా.
ఈ దానం ప్రమాదకరం అందుచేత అబద్దమాడినా ఏం పరవాలేదు
వామనునికి దానం ఇయ్య వద్దని దానవకులాచార్యుడు శుక్రనీతి చెప్తుంటే, మహా దానశీలుడు
బలిచక్రవర్తి అంగీకరించకుండా ఈ దానం ఇచ్చి తీరతాను అబద్ధం ఆడను అంటు ఇలా
చెప్తున్నాడు.
8-592-Saa.
aadin
Sreesati koppupai@M, danavupai, naMsOttareeyaMbupai,
baadaabjaMbulapai@M,
gapOlataTipai, baaliMDlapai nootnama
ryaadaM
jeMdu karaMbu griM daguTa mee@Mdai naa karaMbuMTa mael
gaadae?
raajyamu geejyamun satatamae? kaayaMbu naapaayamae?
ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములు యనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సరకొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి;
కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment