శ్రీవిలసిత
4-1-క.
శ్రీ విలసితధరణీతన
యావదన సరోజ వాసరాధిప! సిత రా
జీవదళనయన! నిఖిల ధ
రావర నుత సుగుణధామ! రాఘవరామా!
శ్రీమహాలక్ష్మీతేజోరూప, ఓర్పుకు
మారుపేరైన భూదేవి పుత్రిక యైన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని
వంటి వాడు; తెల్ల తామర
పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన
రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.
చతుర్థ స్కంధారంభ శ్రీరామ ప్రార్థన.
4-1-ka.
Sree
vilasitadharaNeetana
yaavadana
sarOja vaasaraadhipa! sita raa
jeevadaLanayana!
nikhila dha
raavara
nuta suguNadhaama! raaghavaraamaa!
శ్రీవిలసిత ధరణీతనయా
వదనసరోజ వాస రాధిప = శ్రీరామ {శ్రీవిలసిత ధరణీతనయా వదనసరోజ వాస రాధిప - శ్రీ (లక్ష్మీదేవి వలె, శుభకర
మైన) విలసిత (ప్రకాశము గల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక,
సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వారములకు అధిపతి,
సూర్యుడా), శ్రీరామ}; సిత రాజీవ దళ నయన = శ్రీరామ {సిత రాజీవ దళ నయన - సిత (తెల్లని) రాజీవ (పద్మము) దళ (రేకుల) వంటి
నయన (కన్నులుగల వాడు), శ్రీరామ}; నిఖిల ధరావర నుత సుగుణధామ = శ్రీరామ {నిఖిల ధరావర నుత సుగుణ ధామ - నిఖిల (సమస్త మైన) ధరావర (రాజుల) చేత నుత
(స్తోత్రము చేయబడిన) గుణములకు ధామ (నిలయ మైనవాడ), శ్రీరామ}; రాఘవరామా = శ్రీరామ {రాఘవరామ - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment