Monday, July 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 358

కుయ్యిడ 


1-281-ఉ.
కుయ్యడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డి య్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
య్య గలండు? గర్భజని తాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!
          ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటో? ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో? తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా!
తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.
1-281-u.
kuyyaDa Sakti lae dudaragOLamulOpala nunnavaa@MDa di
kkeyyadi nanaatha nani yeppuDu@M dalli gaNiMpa viMdu nae
Di yyishuvahni vaayuTaku neyyadi maargamu nannu@M gaava nae
yayya galaMDu? garbhajani taapada nevva@M DeRuMgu daivamaa!
          కుయ్యడన్ = కుయ్ అని ఏడ్చుటకు; శక్తి = నేర్పు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము = పిండము; లోపలన్ = లోపల; ఉన్నవాఁడన్ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్ = వినుచుందును; నేడు = ఇవేళ; = ; ఇషు = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నిని; వాయుట = దూరము చేయుట; కున్ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్ = నన్ను; కావన్ = కాపాడుటకు; = ; అయ్య = మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్ = ప్రమాదమును; ఎవ్వఁడు = ఎవడు; ఎఱుంగున్ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: